లైంగిక వాంఛ తీరిస్తేనే అన్నం, మహిళల దుర్భర జీవితం

సిరియా: ఐసిస్ కబంధహస్తాల నుండి ఇప్పుడిప్పుడే విముక్తి అవుతోన్న సిరియాలో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదకలు వెల్లడిస్తున్నాయి. సహయక కేంద్రాల్లో సహయం పొందాలంటే మహిళలను తమ లైంగికవాంఛలు తీర్చుకొనేందుకు ఉపయోగించుకొనేవారని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఐసీస్ నుండి సిరియా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయితే ఇంకా అక్కడ నిర్భంధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే సిరియాలో మహిళలు సహయ కేంద్రాల్లో సహయం పొందాలంటే అక్కడ పనిచేసే పురుషులకు తమ సర్వస్వాన్ని అర్పించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తమ లైంగిక అవసరాలను తీర్చుకొన్న తర్వాతే సహయం కోసం వచ్చిన మహిళలకు సహయకేంద్రాల వద్ద సహయం అందేదని బాధిత మహిళలు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సహయ కేంద్రాలంటేనే మహిళలు భయపడే పరిస్థితులు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి.

లైంగిక వాంఛ తీర్చితేనే అన్నం
సిరియాలో ఇలాంటి అనైతిక కార్యకలాపాలు పెచ్చు మీరడంతో అంతర్జాతీయ సేవా సంస్థల ద్వారా ఉచితంగా అందే సహాయాన్ని తీసుకునేందుకు కూడా మహిళలు జంకుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ అమానవీయ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఈ సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు అక్కడి మహిళలు నిరాకరిస్తున్నట్టు స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు బీబీసీకి వెల్లడించారు.తమకు భోజనం కావాలంటే సహయక కేంద్రాల్లో పనిచేసే పురుషులకు తమ జీవితాన్ని అర్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొందరు బాధితులు మీడియాకు వెల్లడించారు.లైంగికవాంఛలు తీరిస్తేనే మహిళలకు సహయం అందే పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు కొందరు వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నట్టు మీడియా ప్రకటించింది.

సహయక కేంద్రాలకు మహిళలు వెళ్ళడం లేదు
అక్కడి మగవారి కోరికలను తీర్చాకే ఈ సంస్థలిచ్చే సహాయాన్ని తాము వెంట తెచ్చుకున్నామని ఇతరులు భావించే అవకాశమున్నందున ఈ సరఫరా కేంద్రాలకు వెళ్లడం లేదని కొందరు యువతులు తెలిపారు. ఇలాంటి ఆకృత్యాలు సాగుతున్నా కొన్ని స్వచ్ఛందసంస్థలు పట్టించుకోవడం లేదని ఓ ఉద్యోగి పేర్కొన్నాడు. సిరియాలో గవర్నర్ల పాలనలోని వివిధ ప్రాంతాల్లో మానవతా సహాయానికి ప్రతిగా లైంగికదోపిడి సాగుతున్నట్టుగా గతేడాది ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) చేసిన పరిశీలనలో తేలింది.

టెంపరరీ వెడ్డింగ్
స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే రోజువారి ఆహారం కోసం యువతులు, అమ్మాయిలు పరిమిత కాలానికి వివాహాలు చేసుకుని అక్కడి అధికారులకు ‘సెక్సువల్ సర్వీసెస్' అందిస్తున్నారు. సహాయాన్ని తీసుకు నేందుకు వచ్చే వారి ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు వారిని ఇంటివరకు వాహనాల్లో వదిలిపెడు తున్నారు. తాము అందజేస్తున్న సహాయాలకు ప్రతిగా అధికారులు, ప్రతినిధులు కోరిక తీర్చుకుంటున్నారని వాయిస్ ఫ్రం సిరియా 2018 నివేదిక వెల్లడించింది.

భర్తను కోల్పోయిన వారి పరిస్థితి దుర్భరం
పురుషుల పరిరక్షణలోని మహిళలు, అమ్మాయిలతో పాటు భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నమని వాయిస్ ఫ్రం సిరియా సంస్థ ప్రకటించింది. జోర్డన్లోని ఓ శరణార్థుల శిబిరంలో సిరియా మహిళ బృందం ఇలాంటి లైంగికదాడులకు గురైనట్లు మూడేళ్ల క్రితం మొదటిసారి బయటపడింది. దారా, క్యునీత్ర తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై తాను జరిపిన పరిశీలనల్లో ఇది యధార్థమేనని తేలిందని స్వచ్ఛంద సహాయ సలహాదారు డానియల్ స్పెన్సర్ తెలిపారు.