వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాలో తొలిసారిగా: స్వలింగ వివాహాలకు ఆ దేశం ఆమోదం

|
Google Oneindia TeluguNews

తైవాన్‌లో ఆదేశ ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వలింగ వివాహం (సేమ్ సెక్స్ మ్యారేజ్) చేసుకోవచ్చంటూ ఆదేశ పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాగానే ఆ దేశ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఇప్పటికే స్వలింగ వివాహాలపై ఆదేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లుకు అనుకూలంగా మొత్తం 66 ఓట్లు రాగా వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. ఈ కీలక బిల్లు పాస్ కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్‌కు రెండోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు మార్గం సుగుమం అయ్యింది. ప్రస్తుతం పార్లమెంటులో పాస్ అయిన బిల్లు అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్‌ సంతకం చేస్తే చట్టరూపం దాలుస్తుంది. ఇక బిల్లు పాస్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తామని ప్రగతిశీల విలువలు ముందుగా తూర్పాసియా దేశాలనుంచే మొదలవుతాయని మరోసారి నిరూపిస్తామని అధ్యక్షురాలు త్సాయ్ ఓటింగ్‌ కంటే ముందు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎక్కడైనా సరే ప్రేమే గెలుస్తుందని ప్రపంచానికి చాటుతామని చెప్పారు. 2016 తన ఎన్నికల ప్రచారంలో వివాహ సమానత్వం చట్టం తీసుకొస్తామని నాటి అధ్యక్ష అభ్యర్థిగా హామీ ఇచ్చారు త్సాయ్.

Taiwnan creates history in Asia by passing same sex marriage bill in Parliament

ఇదిలా ఉంటే స్వలింగ వివాహాల తర్వాత పిల్లలను దత్తత తీసుకోవడం, ఇతర దేశాల వారిని వివాహం చేసుకోవడం లాంటి కీలక అంశాలను పొందుపర్చారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. 2017 నుంచే స్వలింగ వివాహం బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మే 24లోగా చట్టం చేయాలంటూ ఆదేశ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక గతేడాది స్వలింగ వివాహాలను తైవాన్‌లోని ఓటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. వివాహం అనే వ్యవస్థలో పురుషుడు స్త్రీ మాత్రమే ఒక్కటవ్వాలని లేదంటే అది సృష్టి విరుద్ధం అవుతుందని కొందరు చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో అంటే 2017లో ఆస్ట్రేలియా స్వలింగ వివాహా చట్టంకు ఆమోదం తెలుపింది.

English summary
english descriptionTaiwan became the first place in Asia to legalise same-sex marriage on Friday, as thousands of demonstrators outside parliament cheered and waved rainbow flags, despite deep divisions over marriage equality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X