• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాలిబన్లను దెబ్బకొట్టే భారత్, యూఎస్ ప్లాన్-కీలకంగా తజికిస్తాన్-అందులోనే మన ఎయిర్ బేస్

|

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా ప్రజా ప్రభుత్వ స్ధానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లను ముచ్చెమటలు పట్టించిన చరిత్ర పంజ్ షీర్ కు ఉంది. కానీ పంజ్ షీర్ లోయలో అన్ని రోజుల పాటు తాలిబన్లను ముప్పతిప్పలు పెట్టిన ప్రతిఘటన దళాల వెనుక ఉన్నది తజికిస్తాన్. ఆప్ఘన్ రాజకీయాలపై తనదైన ముద్ర కొనసాగించే తజక్కులకు తాలిబన్లు తమ ప్రభుత్వంలో ఎప్పుడైతే సరైన ప్రాతినిధ్యం కల్పించలేదో అప్పటి నుంచీ రగిలిపోతున్న తజికిస్తాన్ .. పంజ్ షీర్ లో వారికి కొంతకాలం చుక్కలు చూపించింది. చివరికి పాకిస్తాన్ రంగ ప్రవేశంతో పంజ్ షీర్ ను తాలిబన్లు వశం చేసుకున్నారు. అయితే భవిష్యత్తులో తాలిబన్లకు వ్యతిరేకంగా సాగే పోరులో తజికిస్తాన్ కీలకంగా మారబోతోంది.

 ఆప్ఘనిస్తాన్లో తజికిస్తాన్ జాతీయులు

ఆప్ఘనిస్తాన్లో తజికిస్తాన్ జాతీయులు

ఆప్ఘన్ రాజకీయాలపై పొరుగున ఉన్న తజికిస్తాన్ ముద్ర ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన ఆప్ఘనిస్తాన్ లోనూ ఇప్పటికీ మైనార్టీలుగా తజక్కులు ఉండనే ఉన్నారు. అంతెందుకు తాలిబన్ల ప్రభుత్వంలో సైతం ఇద్దరు తజక్కులకు స్ధానం దక్కింది. మరింత మందికి చోటు దక్కుతుందని ఆశించిన తజికిస్తాన్ కు నిరాశ తప్పలేదు. దీంతో ఆఫ్ఘన్ వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరించే తజికిస్తాన్ ఇప్పుడు భారత్ తో పాటు యూఎస్, నాటో దళాలకు కీలకంగా మారుతోంది. భవిష్యత్తులో తాలిబన్లపై సాగించే పోరాటాల్లో తజికిస్తాన్ పాత్ర విస్మరించలేనిది.

 తాలిబన్లపై తజికిస్తాన్ పోరాటం

తాలిబన్లపై తజికిస్తాన్ పోరాటం

తాలిబన్లపై తజికిస్తాన్ జాతీయుల పోరాటం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఒకప్పుడు తాలిబన్లకు మద్దతుగా నిలిచిన తజికిస్తాన్ ప్రభుత్వం.. ఆ తర్వాత తాలిబన్లకు వ్యతిరేకంగా నార్తర్న్ అలయన్స్ పేరుతో ప్రతిఘటన దళాలు సాగించిన పోరాటానికి సైతం మద్దతుగా నిలిచింది. దీంతో తజికిస్తాన్ మద్దతు కోసం తాలిబన్లతో పాటు ప్రతిఘటన దళాలకూ తజికిస్తాన్ కీలకంగా మారిపోయింది. చారిత్రకంగా తాలిబన్లను తజక్కులు వ్యతిరేకిస్తారు. అయితే వీరిలో కొందరు మాత్రం తాలిబన్లతో కలిసి ఉంటున్నారు. పంజ్‌షీర్ ప్రతిఘటన కొనసాగుతున్నప్పుడు, తజికిస్తాన్ ప్రభుత్వం ప్రతిఘటన దళాలకు ఆయుధాలు మరియు నిత్యావసరాలను సరఫరా చేసినట్లు అనేక నివేదికలు వచ్చాయి. అయితే దీనిని తజికిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.

9/11 దాడుల తర్వాత అమెరికా తాలిబన్ల సర్కార్ కూల్చివేతతో ఆప్ఘన్ లో తజకిస్దాన్ వాసుల హవా పెరిగింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో తజక్కులు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు తాలిబన్ల సర్కార్ లోనూ 33 మందిలో ఇద్దరు తజక్కులు ఉన్నారు.
తాలిబన్ల దాడులతో ఆప్ఘన్ సైనికులు తజికిస్తాన్ కు పారిపోగా.. వారిని తజకిస్తాన్ మాత్రం వెనక్కి పంపలేదు.

 మసౌద్, రబ్బానీలూ తజక్కులే

మసౌద్, రబ్బానీలూ తజక్కులే

పంజ్ షీర్ లో ప్రతిఘటన దళాల నేత అయిన అహ్మద్ షా మసూద్ కు తజికిస్దాన్ గతంలో తమ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఇస్మాయిలీ సోమోనీని ప్రదానం చేసింది. అప్ఘన్ మాజీ అధ్యక్షుడు బుర్హనుద్దీన్ రబ్బానీకి కూడా ఇచ్చింది. 1990ల్లో తజికిస్తాన్ లో అంతర్యుద్ధం ముగించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తిరిగి ఆప్ఘన్ లో నార్తరన్ అలయన్స్ ఏర్పాటు చేశారు. 9/11 దాడులకు కొన్ని రోజులకు ముందు మసౌద్, 2011లో రబ్బానీ హత్యలు జరిగాయి. ఆ తర్వాత అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ తాలిబన్లపై పోరాడుతున్నాడు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన నార్తర్న్ అలయన్స్ కు తజికిస్తాన్ మద్దతు పలికింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మారిన పరిస్ధితుల్లో తాలిబన్లకు తజికిస్దాన్ మద్దతు పలికినా తజక్కులకు మాత్రం వారు కేబినెట్లో కేవలం రెండు బెర్త్ లు మాత్రమే ఇచ్చారు.

 తాలిబన్లపై రగిలిపోతున్న తజికిస్తాన్

తాలిబన్లపై రగిలిపోతున్న తజికిస్తాన్

ఆప్ఘన్ లో పష్తూన్లు 44 శాతం ఉండగా.. మైనార్టీలైన తజిక్కులు 25 శాతం, హజారాలు, ఉజ్బెక్ లు 9 శాతం, ఐమాన్లు, తుర్క్ మన్లు, బలూచీల మిగిలి శాతంగా ఉన్నారు. ఆఫ్ఘన్ జనాభాలో తక్కులు, ఇతర మైనారిటీలు కలిసి 50 శాతానికి పైగా ఉన్నందున, కొత్త క్యాబినెట్‌లో వారికి తగినంత ప్రాతినిధ్యం ఉండాలని తజికిస్తాన్ అధ్యక్షుడు రహమోనోవ్ కోరుకున్నాడు. అయితే తాలిబన్లు మాత్రం కేవలం ఇద్దరితో సరిపెట్టారు. దీంతో తజికిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల సర్కార్ పై రగిలిపోతోంది. అందుకే పంజ్ షీర్ లోనూ ప్రతిఘటన దళాలకు పరోక్షంగా సహకరించింది. ఇప్పటికీ తాలిబన్లకు వ్యతిరేకంగా సాగే పోరాటాల్లో తజికిస్తాన్ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది.

 తజికిస్తాన్ లో భారత్ ఎయిర్ బేస్

తజికిస్తాన్ లో భారత్ ఎయిర్ బేస్

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ కు సంబంధించిన ఏకైక విదేశీ ఎయిర్ బేస్ తజికిస్తాన్ లోనే ఉంది. గతంలో భారత విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేసి కాందహార్ కు తీసుకెళ్లిన సమయంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు తజికిస్తాన్ రాజధాని దుషాన్ బేలోనూ షాంఘై సహకార సమాఖ్య ( SCO) సదస్సు జరగబోతోంది. ఇందులో భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఇలా తజికిస్తాన్ తో భారత్ కు ఎంతో అనుబంధం ఉంది. భవిష్యత్తులో తాలిబన్లకు వ్యతిరేకంగా భారత్ సాగించే పోరాటాల్లోనూ తజికిస్తాన్ కీలకంగా మారబోతోంది.

 తజికిస్తాన్ నుంచి తాలిబన్లను కొట్టే ప్లాన్ ?

తజికిస్తాన్ నుంచి తాలిబన్లను కొట్టే ప్లాన్ ?

ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన రాకతో పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి. అయితే ఇవన్నీ తిరిగి ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించే తజికిస్తాన్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న తజక్కులకు సైతం రక్షణ లేకుండా పోతోంది. దీంతో భవిష్యత్తులో తాలిబన్లపై పోరాటానికి తజికిస్తాన్ తో పాటు భారత్, యూఎస్ వంటి దేశాలు ప్రయత్నిస్తే అప్పుడు ఈ దేశం కీలకంగా మారబోతోంది. అందులోనూ భారత్ ఎయిర్ బేస్ ను మన దేశంతో పాటు విదేశాలు కూడా వాడుకునే అవకాశముంది. అప్పుడు తాలిబన్లపై సులువుగా విజయం సాధించేందుకు అవకాశం దక్కుతుందని భారత్, యూఎస్ తో పాటు నాటో దేశాలు కూడా అంచనా వేస్తున్నాయి.

English summary
tajikistan would be the key base for india and US' future resistance against talibans in afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X