• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిరియా నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోండి.. లేదంటే: ట్రంప్ వార్నింగ్

|

వాషింగ్టన్: అంతర్గత కలహాలు, దాడులతో అల్లకల్లోలానికి గురైన సిరియాకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆ దేశ ప్రజల్ల నైతిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సిరియాలో దాదాపు యుద్ధం ముగిసినట్టేనని భావిస్తున్న ట్రంప్.. అక్కడున్న సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా యూరోపియన్ దేశాలకు సూచించారు. సిరియాలో శాంతిని నెలకొల్పుతున్నామనే పేరుతో సైన్యం చేసిన ఆకృత్యాలపై విచారణ చేపట్టాలని కూడా ట్రంప్ ఆదేశించారు. లేకపోతే- తాను కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని, లేకపోతే తన నిర్బంధంలో ఉన్న జిహాదీలను విడిచి పెట్టేలా చేయొద్దని అన్నారు.

భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అమెరికా సహా, యూరోపియన్ దేశాలకు సంబంధించిన సైనిక బలగాలు కొన్నేళ్లపాటు యుద్ధాన్ని కొనసాగించాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా కనిపించిన ఐసిస్.. ఈ యుద్ధంలో శక్తి విహీనమైంది. శాంతి బలగాలు చేసిన దాడుల్లో ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఐసిస్ ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలు, పట్టణాలను కూడా శాంతి సైనిక బలగాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. సిరియాలోని క్యాలిఫట్ అనే ఓ చిన్న ప్రాంతం మాత్రమే ఐసిస్ చేతిలో ఉంది. దీన్ని విడిపించడానికి సైనికులు తరచూ ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు.

Take Back Over 800 ISIS Fighters Captured in Syria, Trump Tells European Allies

ఐసిస్ ఉగ్రవాదులు దాదాపు తమ శక్తి సామర్థ్యాలను, పలు ప్రాంతాలపై తమకున్న ప్రాబల్యాన్ని కోల్పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది డిసెంబర్ లో అమెరికా తన సైన్యాన్ని సిరియా నుంచి వెనక్కి పిలిపించుకుంది. భారీ ఎత్తున సైన్యాన్ని మోహరింపజేయాల్సిన అవసరం లేదని భావించిన డొనాల్డ్ ట్రంప్.. తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం అక్కడ యూరోపియన్ దేశాలకు చెందిన సైనికులు సిరియాలో ఉంటున్నారు. సుమారు 800 మంది సైనికులు సిరియాలో ఉంటున్నారు. వారిని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలకు సూచించారు. వారు చేసిన ఘాతుకాలపై విచారణ చేపట్టాలని కూడా ఆదేశించారు.

Take Back Over 800 ISIS Fighters Captured in Syria, Trump Tells European Allies

బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ..ఇతర యూరోపియన్ దేశాధినేతలను నేను ఒక్కటే కోరుతున్నా. 800 మంది ఐసిస్ వ్యతిరేక సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించండి. వారు చేసిన పనులపై విచారణ చేపట్టండి. క్యాలీఫట్ పై ఐసిస్ ఉగ్రవాదులు పట్టు కోల్పోతున్నారు.. అని ట్రంప్ అన్నారు. ఈ పరిస్థితుల్లో సైన్యం అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదని, వెనక్కి పిలిపించి, విచారణ చేపట్టాలని సూచించారు. పనిలో పనిగా ట్రంప్.. ఐసిస్ ఉగ్రవాదులను కూడా హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ దాడులకు తెగబడటం, ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలను చేజిక్కించుకోవడం వంటి పనులకు దిగితే, సమీపంలో ఉన్న మిలటరీ బేస్ క్యాంపుల నుంచి దాడులు చేస్తామని అన్నారు. 2017 తరువాత ఐసిస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. సైన్యం దాడులను తట్టుకోలేకపోయింది. తమ ఆధీనంలో ఉన్న మోసుల్, రక్కా వంటి ప్రాంతాలను కోల్పోయింది. ప్రస్తుతం క్యాలీఫట్ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఐసిస్ తన ఆధీనంలో ఉంచుకుంది. దీన్ని విడిపించడానికి సైనికులు అక్కడ క్రమంగా దాడులు చేస్తున్నారు.

English summary
Washington: President Donald Trump has demanded that the European nations take back more than 800 ISIS fighters captured in Syria and put them on trial, warning that the US otherwise will be forced to free the jihadists after it pulls out from the war-torn country. President Trump surprised the world by announcing in December that he was withdrawing 2000 American troops from war-torn Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X