వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో ఉద్యోగం! అమెజాన్ ఆరేళ్ల అద్భుత సృష్టి, థ్రిల్లవుతున్న ఉద్యోగులు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అడవిలోకి వెళ్లాలంటేనే భయంకానీ నిజానికి అడవి అంటే అందరికీ ఇష్టమే. అదే అడవి మీ ఆఫీసులోకి వచ్చేస్తే.. అహ కాదు కాదు.. మీ ఆఫీసే అడవిలో ఉంటే? ఆఫీసు ఏంటి.. అడవిలో ఏంటి.. అనుకుంటున్నాకదూ!

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏం చేసినా ఆ స్థాయిలోనే ఉంటుంది మరి. తాజాగా అమెజాన్ తన ఉద్యోగుల కోసం ఆఫీసులోకే అడవిని తెచ్చేసింది. ఉహు.. దీనికన్నా అడవిలోనే ఆఫీసు పెట్టింది అనడం కరెక్ట్.

ప్రకృతి ఒడిలో పని చేసేలా...

ప్రకృతి ఒడిలో పని చేసేలా...

ప్రకృతిని ప్రేమించగలిగే గుణం ఉన్న వారందరికీ అడవి అంటే ఇష్టమే. అడవిలోకి తీసుకెళ్లాలేగానీ ఎన్నిరోజులైనా ఎంజాయ్ చేస్తారు. పచ్చటి ఆ వాతావరణానికి అంతలా ఫిదా అయిపోతారు. ప్రకృతి పట్ల మనుషుల్లో ఉండే ఈ కోరికని గ్రహించిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ను తన ఉద్యోగుల చెంతకు చేర్చింది.

ఆఫీసులోనే రెయిన్ ఫారెస్ట్...

ఆఫీసులోనే రెయిన్ ఫారెస్ట్...

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం ‘ట్రీహౌస్' ఏర్పాటు చేస్తే.. యాపిల్ కంపెనీ ఏకంగా ‘స్పేస్ షిప్‌' నిర్మించింది. ఇప్పుడు అమెజాన్ ఒకడుగు ముందుకేసి తాజాగా తన ఉద్యోగుల కోసం సీటెల్‌లోని డౌన్‌టౌన్‌ ఆఫీసులో ‘రెయిన్ ఫారెస్ట్‌'నే సృష్టించింది.

ఆఫీసు అంటే ఇలా ఉండాలి...

ఆఫీసు అంటే ఇలా ఉండాలి...


ఆఫీసంటే టేబుళ్లు.. కుర్చీలు.. కంప్యూటర్లు.. ఏసీలు.. ఇవేనా? కాదు - ఉద్యోగులు తమ పనిలో అలసటను మర్చిపోవాలి.. కళ్ల ఎదురుగా కనిపించే వాతావరణం వినూత్నంగా ఆలోచించగలిగేలా ఉద్యోగులను ప్రేరేపించాలి. సరిగ్గా ఇలాగే ఆలోచించిన అమెజాన్ తన డౌన్‌టౌన్‌ ఆఫీసులో ఉద్యోగులకు ప్రకృతిని ఆస్వాదిస్తూ పనిచేసేలా తన కార్యాలయాన్ని రూపుదిద్ది ఉద్యోగులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.

అమెజాన్ కొత్త క్యాంపస్ ‘ది స్పియర్స్’...

అమెజాన్ కొత్త క్యాంపస్ ‘ది స్పియర్స్’...

తన కలల ప్రపంచానికి అమెజాన్ ‘ది స్పియర్స్' అనే పేరు పెట్టింది. అమెరికాలోని సీటెల్‌లో సోమవారం దీనికి ప్రారంభించింది. సంస్థ ఉద్యోగుల మధ్య కొత్త కార్యాలయాన్ని అమెజాన్ సీఈవో బెజోస్, వాషింగ్టన్ గవర్నర్, సీటెల్ మేయర్, ప్రారంభించారు.

గోళాకారంలో గ్లాస్ మెటల్‌తో...

గోళాకారంలో గ్లాస్ మెటల్‌తో...

అమెజాన్ సరికొత్త కార్యాలయం ‘ది స్పియర్స్'ను గోళాకారంలో గ్లాస్ మెటల్‌తో నిర్మించారు. 620 టన్నుల స్టీల్, 2643 గాజు పలకతో నిర్మాణం పూర్తైంది. 400 జాతులకు చెందిన 40 వేల మొక్కలు, మినీ జలపాతాలతో కార్యాలయం ఉద్యోగులకు కనువిందు చేస్తోంది. ఈ సరికొత్త కార్యాలయం నిర్మాణానికి ఆరేళ్లకుపైగా శ్రమించింది అమెజాన్.

1969 నాటి చెట్టు ఎత్తుకొచ్చేశారు...

1969 నాటి చెట్టు ఎత్తుకొచ్చేశారు...

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెజాన్ కొత్త ఆఫీసు ‘ది స్పియర్స్'లో 1969 నాటి చెట్టు ఒకటి ఉంది. కాలిఫోర్నియాలోని ఓ గార్డెన్‌లో ఉన్న ఈ చెట్టును క్రేన్ సాయంతో తీసుకొచ్చి ఈ ఆఫీసులో నాటారు. దీనికి అమెజాన్ పెట్టిన పేరు రూబీ. ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపి వారు వినూత్నంగా పని చేయడానికి ఈ వాతావరణం ఎంతగానో తోడ్పడుతుందని అమెజాన్ సీఈవో బెజోస్ భావన.

English summary
Amazon opened its new downtown Seattle office space on Monday, revealing a campus that looks more like a rainforest than a typical cubicle farm. The reveal of the new Sphere Complex comes after the world's largest online retailer spent seven years planning and constructing a cutting-edge space that it hopes will help spark its employees' creativity. Rather than the usual mix of closed hallways and traditional conference rooms, the space features winding walkways that lead to hidden nooks and open spaces peppered with tables and chairs. And this being a tech office, the wifi is even accessible in "the nest"—a meeting space ensconced in a wooden structure that resembles a bird's nest. As striking as the structure itself is the vast world of plant life it contains. The Spheres' three glass domes are home to some 40,000 plants from all around the world—including 55-foot tall tree, nicknamed Rubi, short for Ficus rubiginosa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X