వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ నవాజ్ షరీఫ్ పార్టీ... తీవ్రవాదులకు తాలిబన్ చీఫ్ ఆదేశం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లాహోర్: పెషావర్‌లో సైనిక పాఠశాలపై దాడుల తర్వాత మరణశిక్షపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను విచారించేందుకు మిలటరీ కోర్టులను ఏర్పాటు చేయడం తదితర నిర్ణయాల నేపథ్యంలో, పాకిస్ధాన్ తెహ్రిక్ ఏ తాలిబన్ తీవ్రవాద సంస్ధ మండిపడుతోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ - ఎన్‌ని లక్ష్యంగా చేసుకోవాలని తీవ్రవాదులకు తాలిబన్ అధినేత ముల్లా ఫజులుల్లా ఆదేశించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోని సందేశంగా పంపాడు. ఈ వీడియోలో తమ మొదటి శత్రువు నవాజ్ షరీఫ్ అని, అందుకే ఇప్పుడు పీఎంఎల్-ఎల్‌ను లక్ష్యంగా చేసుకోవాలని పాకిస్ధాన్‌లోని జిహాదీలకు చెప్పాడు.

Taliban chief Mullah Fazlullah orders militants to target Nawaz Sharif’s party

పీఎంఎల్-ఎల్‌ పార్టీ నేతలపై తీవ్రంగా దాడులు చేయాలని పాకిస్ధాన్ ముజాహిదీన్‌లను కోరుతున్నా. అలా చేయడం వల్ల వారు సరైన దారిలోకి వస్తారు లేదంటే నరకానికి వెళతారని తాలిబన్ చీఫ్ ముల్లా ఫజులుల్లా పేర్కొన్నాడు.

40ఏళ్ల ఫజులుల్లాను ముద్దుగా 'రేడియా ముల్లా' అని పిలుచుకుంటారు. స్వాత్ లోయలో తాలిబన్ లీడర్‌గా ఎదిగిన ఫజులుల్లా నవంబర్ 2013న తాలిబన్ చీఫ్ హకిముల్లా మెహ్సద్‌ను చంపడంతో తాలిబన్ చీఫ్‌గా అవతరించాడు. తాలిబన్ చీఫ్ ఫజులుల్లా బెదిరింపు మెసేజిలపై ఇప్పటి వరకు నవాజ్ షరిఫ్ పార్టీ పీఎంఎల్-ఎల్‌ స్పదించలేదు.

పాకిస్ధాన్‌లో తాలిబన్ల దాడిలో ఇప్పటి వరకు సుమారు 800 మంది రాజకీయ నాయకులు బలయ్యారు. గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్, వైమానిక దాడుల్లో పౌరులు హతమవుతున్నారని వస్తున్న ఆరోపణలను విమర్శించాడు.

English summary
Pakistani Taliban chief has ordered militants to hit the leaders of Prime Minister Nawaz Sharif’s ruling party after the government lifted a moratorium on death penalty and set up military courts to try terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X