• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాలిబన్ల అరాచకం... నడిరోడ్డుపై క్రేన్‌కు మృతదేహాన్ని వేలాడదీశారు... ఎందుకంటే...

|

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా హెరాత్ నగరంలోని ఓ కూడలి వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసి ప్రదర్శించారు.మొత్తం నలుగురి మృతదేహాలను అక్కడికి తీసుకొచ్చిన తాలిబన్ ఫైటర్స్... ఒకరి మృతదేహాన్ని అక్కడ ప్రదర్శించి,మిగతామూడు మృతదేహాలను నగరంలోని ఇతర కూడళ్లలో ప్రదర్శించేందుకు తరలించారు.వజీర్ అహ్మద్ సిద్దిఖీ అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ నలుగురిని కిడ్నాప్ కేసులో పోలీసులు హతమార్చినట్లు తాలిబన్ ఫైటర్స్ వెల్లడించారు.

తాలిబన్ ప్రభుత్వం Ministry of Propagation of Virtue and Prevention of Vice పునరుద్దరించింది. ఇస్లాం ధర్మ ప్రచారంతో పాటు,ఇస్లాం నిబంధనలను ఉల్లంఘించేవారికి ఈ మంత్రిత్వ శాఖ ద్వారానే శిక్షలు అమలవుతాయి. 1996-2001లో తాలిబన్ల పాలనలో దీని ద్వారా షరియా చట్టాలను అత్యంత కఠినంగా అమలుచేశారు.బహిరంగ మరణశిక్షలు విధించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలపై బహిరంగంగా సామూహిక అత్యాచారం,హత్యలు జరిగేవి.కొన్ని సందర్భాల్లో వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఆనాటి పద్దతులన్నీ తాలిబన్లు మళ్లీ అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు.ఒక్కొక్కటిగా ఆంక్షలను అమలుచేస్తున్నారు.

ఇప్పటికే స్త్రీలను విద్య,ఉద్యోగాలకు దూరం చేసే చర్యలకు పూనుకున్నారు.బాలికల స్కూళ్లను రీఓపెన్ చేయకుండా కేవలం బాలుర స్కూళ్లను మాత్రమే తెరిచారు.కాబూల్ నగరంలో పనిచేసే మహిళలను ఉద్యోగాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని పోస్టుల్లో మాత్రమే మహిళలు కొనసాగుతారని చెప్పారు.ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో మహిళా ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగాలు మానిపించి ఇళ్లకు పంపించేశారు.ఒకవేళ్లీ ఆఫీసులకు వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.స్త్రీలంటే తాలిబన్ల దృష్టిలో కేవలం పిల్లలను కనే యంత్రాలు మాత్రమే.వారి హక్కులను తాలిబన్లు ఏమాత్రం గౌరవించట్లేదు.

taliban displays a dead body from crane in herat city afghanistan

తాలిబన్ సర్కార్.. తాజాగా మీడియాపై కఠినమైన ఆంక్షలు విధించింది. మీడియా కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేలా 11 నియమాలను ముందుకు తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్క రూల్‌ను పాటించకపోయినా సదరు మీడియా సంస్థ డేంజర్‌లో పడినట్లే.తాలిబన్లు విధించిన ఈ కొత్త రూల్స్ వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్నాయని అక్కడి జర్నలిస్టులు వాపోతున్నారు.తాలిబన్ ప్రభుత్వం మీడియాపై విధించిన 11 ఆంక్షల్లో మొదటి మూడు ఆంక్షల ప్రకారం... ఇస్లాంకు విరుద్దంగా,జాతీయ నేతలకు అవమానపరిచేలా కథనాలను ప్రసారం చేయవద్దు లేదా ప్రచురించవద్దు.అయితే ఆ వార్తలు యాంటీ ఇస్లామిక్ లేదా జాతీయ నేతలను అవమానపరిచేలా ఉన్నాయనేది ఎవరు నిర్దారిస్తానే విషయంలో స్పష్టత లేదు. రూల్ 7,8 ద్వారా వార్తలకూ సెన్సార్‌షిప్‌ వర్తిస్తుంది.వార్తలు ప్రసారం చేసేటప్పుడు లేదా ప్రచురించేటప్పుడు... చాలా జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా,అధికారికంగా ధ్రువీకరించని వార్తల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపించే లేదా సమాజ నైతికతకు భంగం కలిగించే అవకాశం ఉన్న వార్తల ప్రసారంలో మీడియా సంస్థలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.రూల్ 10,11 ప్రకారం... మీడియా సంస్థలు వార్తల ప్రసారం,ప్రచురణ విషయంలో గవర్నమెంట్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌తో కోఆర్డినేట్ చేసుకోవాలి. రూల్ 9 ప్రకారం... మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రసారం చేయాలి. ఈ ఆంక్షలకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఇప్పటికీ బయటకు వెల్లడవలేదు. తాలిబన్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు అక్కడి జర్నలిస్టులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తమకు సాయం చేయాలని కోరుతూ నిత్యం వందలాది మంది ఆఫ్గన్ జర్నలిస్టుల నుంచి మెయిల్స్ వస్తున్నట్లు అమెరికాలోని ప్రెస్ ఫ్రీడం ఆర్గనైజేషన్ సీనియర్ మెంబర్ స్టీవెన్ బట్లర్ తెలిపారు.

English summary
The Taliban recently hung the body of a man on a crane at a crossroads in the city of Herat.A total of four bodies were brought there by Taliban fighters ... one body was displayed there and the other three bodies were moved to other squares in the city for display.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X