వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త నాయకుడు: తాలిబన్లలో చీలిక

|
Google Oneindia TeluguNews

కాబుల్: అప్గనిస్థాన్ లో తాలిబన్ల మధ్య చీలిక ఏర్పడింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు తన్నుకుంటున్నారు. తాలిబన్ ఫైటర్స్, స్ల్పింటర్ అంటూ రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. తాలిబన్లు కొత్త నాయకుడి సారధ్యాన్ని కోరుకుంటున్న సమయంలో వీరు గ్రూపులుగా విడిపోయారని తెలిసింది.

ఉన్నత స్థానంలో ఉన్న తాలిబన్ నాయకుల మద్య గొడవలు మొదలైనాయి. ప్రస్తుతం తాలిబన్ నేతగా ఉన్న ముల్లా అక్తర్ మహమ్మద్ మన్సూర్ తో పలువురు నాయకులు విభేదిస్తున్నారు. ముల్లా అక్తర్ మహమ్మద్ మన్సూర్ సమర్థవంతమైన నాయకుడు కాదని వారు అంటున్నారు.

ముల్లా అహమ్మద్ ఒమర్ స్థానంలో వచ్చిన మన్సూర్ ఆ స్థానానికి న్యాయం చెయ్యడం లేదని అంటున్నారు. ఆ స్థానంలో ఒమర్ కు చాల సన్నిహితుడు అయిన ముల్లా అహమ్మద్ రసోల్ ను సమర్థిస్తామని తాలిబన్ నేతలు తేల్చి చెప్పారు.

Taliban militants challenging new leader in Afghanistan

ఈ నేపధ్యంలోనే తాలిబన్ల మద్య గ్రూపు రాజకీయాలు మొదలైనాయి. ప్రస్తుతం ఉన్న అప్గనిస్థాన్ ప్రభుత్వానికి తాలిబన్ నాయకుడు ముల్లా అక్తర్ మహమ్మద్ మన్సూర్ సహకరిస్తున్నాడని, ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

అయితే కొత్తగా వచ్చే తాలిబన్ నేతలతో చర్చలు జరపాలని, లేదంటే దేశంలో ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ప్రయత్నించాలని అప్గనిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అక్కడి మీడియా వెల్లడించింది.

English summary
Taliban militants challenging new leader Mullah Akhtar Mohammad Mansoor as being illegitimate to substitute Mullah Mohammad Omar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X