Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్ల చేతుల్లోకి బంగ్రమ్ మిలిటరీ జైలు: 5వేల మంది ఖైదీలను విడిచిపెట్టారు

కాబూల్: తాలిబన్లు అనుకున్నది సాధించారు. మొత్తం ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ఇకపై ఆ దేశంలో తాలిబన్ల పాలన కొనసాగనుంది. ఇప్పటికే ఆప్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, బంగ్రమ్ ఎయిర్ బేస్ కూడా తాలిబన్ల వశమైంది. ఇంతకుముందు ఇది అతిపెద్ద యూఎస్ మిలిటరీ బేస్‌గా ఉంది.

Recommended Video

    Afghanistan Vice President Trolls Pakistan | Oneindia Telugu

    బంగ్రం జైలు కూడా యూఎస్ బలగాల ఆధీనంలో ఉండేది. కానీ, ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ నుంచి తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు భారీ దాడులతో విరుచుకుపడి ఆప్ఘాన్ మొత్తాన్ని తమ వశం చేసుకున్నారు.

    Taliban seize Bagram military prison 25 km north of Kabul, inmates freed.

    బంగ్రం ఎయిర్ బేస్‌లోని జైల్లో ఉన్న 5000 మంది ఖైదీలను ఇప్పుడు తాలిబన్లు విడిచిపెట్టారు. ఈ ఖైదీలంతా తాలిబన్లకు లొంగిపోయారిన బగ్రం జిల్లా చీఫ్ దర్వాయిష్ రౌఫీ తెలిపారు. కాగా, ఈ ఖైదీల్లో చాలా మంది తాలిబన్లతోపాటు ఇస్టామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘాన్ వెళ్లిన నేపథ్యంలో అమెరికా దళాలు ఇక్కడ ఉన్న ఇతర సిబ్బందిని హుటాహుటిన తమ దేశానికి తరలిస్తున్నాయి.

    కాగా, ''ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'' స్థాపనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన తాలిబన్లు దశాబ్దాల ఆటుపోటుల తర్వాత అఫ్గానిస్థాన్ లో మళ్లీ అధికారం కైవసం చేసుకున్నారు. రాజధాని కాబూల్ నగరంలో ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాలతో పాలనా పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. వేలాది మంది తాలిబన్లు భారీ ఆయుధాలతో సైన్యం మాదిరిగా కదులుతూ ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నారు. అఫ్గాన్ లో మొత్తం 34 ప్రావిన్స్(రాష్ట్రాలు) ఉండగా, ఇప్పటికే అన్నిటినీ స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. శనివారం రాత్రి కీలకమైన జలాలాబాద్ పై పట్టు బిగించి, ఆదివారం తెల్లవారేసరికి రాజధాని కాబూల్ సిటీని అన్ని వైపులా చుట్టు ముట్టారు.

    అఫ్గాన్ సర్కారు పతం ఆఖరి నిమిషాల్లో..కాబూల్ నగరాన్ని చుట్టుముట్టిన తాలిబన్ సైన్యాలు ఏ క్షణమైనా యుద్ధభేరి మోగించి, రాజధానిని ఆక్రమించుకుంటాయనే వార్తల నడుమ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాబూల్ సిటీపై దాడి జరగబోదని, శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఆ వెంటనే తాలిబన్ మధ్యవర్తుల బృందం ఒకటి అధ్యక్షభవనంలో చర్చలకు వెళ్లింది. రెండు మూడు గంటల చర్చల అనంతరం.. అఫ్గాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేసినట్లు ప్రకటన వెలువడింది. అదే సమయంలో అధికార పగ్గాలను తాలిబన్ నేతలకు అప్పగిస్తున్నట్లూ వెల్లడైంది..

    శనివారం నాటి ప్రసంగంలో అధ్యక్షుడు ఘని సైనిక సమీకరణపై మాట్లాడటంతో తాలిబన్లు ప్రవేశించే సమయంలో కాబూల్ నగరంలో రక్తపాతం తప్పదనే అంచానలు పెరిగాయి. కానీ అందుకు భిన్నంగా ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయారు. ఘని రాజీనామాతో పరిపాలన పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బరాదర్ బాధ్యతలు చేపట్టడంతో అఫ్గాన్ లో తాలిబన్లకు సంబంధించి నూతన శకం మొదలయినట్లవుతుంది.

    అష్రఫ్ ఘని రాజీనామాతో పూర్తిగా తాలిబన్ల వశమైపోయిన అఫ్గానిస్థాన్ కు కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ నియమితుడయ్యాడు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహ్మద్ ఒమర్ కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన బరాదర్.. అధికారికంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా. ప్రస్తుతం తాలిబన్ల రాజకీయ వ్యూహాలకు ఇంచార్జిగా ఉన్న ఆయన.. అధికార మార్పిడికి సంబంధించి పలు అంతర్జాతీయ వేదికలపై జరిగిన చర్చల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ''ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'' తమ ధ్వేయమని, పాశ్చాత్య శక్తులు అఫ్గాన్ ను విడిచివెళ్లాలని బలంగా వాదించారాయన. నిజానికి తాలిబన్ అధ్యక్ష పదవి ముల్లా ఒమర్ కొడుకైన మొహ్మద్ యాకూబ్ కు దక్కాల్సి ఉన్నా, అతని వయసు మూడు పదులే కావడం, యుద్ద క్షేత్రంలో అనుభవ లేమి తదితర కారణాలతో బరాదర్ కు సంపూర్ణ మద్దతుగా నిలిచాడు. బరాదర్ గతంలో ఓసారి పాకిస్తాన్ లోని కరాచీలో భద్రతా బలగాలకు పట్టుపడి, కొన్నాళ్లు జైలులోనూ ఉండి ఆ తర్వాత విడుదలై మళ్లీ అఫ్గాన్ వెళ్లిపోయాడు.

    అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించినట్లు 90 రోజుల్లో కాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే తాలిబన్లు కాబూల్ నగరాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. తాలిబన్లు కాబూల్ సరిహద్దులకు చేరే నాటికే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసి, సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇప్పటికీ మూడు నాలుగు వేల మంది సైనికులు అఫ్గాన్ గడ్డపై ఉన్నారు. ఇటు ఘని నిష్క్రమణతో ఆయన పార్టీకి సహకరించిన అధికారులు, మందీమాగధులపై తాలిబన్లు దాడులకు పాల్పడొచ్చనే, ఊచకోతలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాము ప్రతీకారాల గురించి ఆలోచించడం లేదని తాలిబన్ అధికార ప్రతినిధులు చెప్పారు. అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టుకోవడమే తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వారు చెబుతున్నారు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+