వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ సుప్రీం ముల్లా అక్తర్ మన్సూర్ హతం

|
Google Oneindia TeluguNews

కాబూల్: తాలిబన్ల అంతర్గత తగాదాలతో తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రత్యర్థుల చేతిలో అంతం కావలసిన ముల్లా అక్తర్ మన్సూర్ సొంత మనుషులు జరిపిన కాల్పులలో హతం అయ్యాడు.

ఇంతకు ముందు తాలిబన్ చీఫ్ గా ముల్లా ఒమర్ ఉన్నాడు. అతని మరణంతో తాలిబన్ల కమాండర్ల మద్య గ్రూపు రాజకీయాలు తలెత్తాయి. ఎవరు తాలిబన్ చీఫ్ గా ఉండాలి అనే వాదనలు మొదలైనాయి. తాలిబన్లు రెండు వర్గాలుగా విడిపోయారు

అయితే గత జులై నెలలో తాలిబన్ చీఫ్ గా ముల్లా అక్తర్ మన్సూర్ ను నియమించారు. అప్పటి నుంచి ఓ వర్గం వారు ఆయన మీద గుర్రుగా ఉన్నారు. గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి. మళ్లి రెండు వర్గాలుగా విడిపోయారు.

Taliban Supremo Mullah Akhtar mansour has died

తాలిబన్ కమాండర్ల మద్య వివాదం ముదరడంతో పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నారు. గత బుధవారం జరిగిన కాల్పులలో ముల్లా అక్తర్ అన్సూర్ కు తీవ్రగాయాలైనాయి. చికిత్స విఫలమై శుక్రవారం ముల్లా అక్తర్ మన్సూర్ మరణించాడు.

2001లో తాలిబన్ పాలనలో ముల్లా అక్తర్ మన్సూర్ విమానాయాన శాఖ మంత్రిగా పని చేశాడు. అఫ్ఘనిస్థాన్ తో శాంతి చర్చలు జరపడానికి ముల్లా అక్తర్ మన్సూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారని, అందు వలనే ముల్లా అక్తర్ మన్సూర్ ప్రాణాలు పోయాయని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు తెలిపారు.

English summary
Mansour was critically injured in a gunfight on Wednesday in an argument with commanders in the militant group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X