వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్రత్త..కశ్మీర్ వివాదంలోకి అఫ్ఘానిస్తాన్‌ను లాగొద్దు: పాక్‌కు తాలిబన్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం చేసిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ ఆది నుంచి విషం చిమ్ముతూనే ఉంది. భారత్‌ను ప్రపంచ దేశాల ముందు అపరాధిగా నిలిపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇప్పటికే పాక్ ప్రధాని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ దృష్టికి తీసుకెళ్లి తమకు ఏదో అన్యాయం జరిగినట్లు ప్రపంచదేశాధినేతల దృష్టికి చేరవేయాలని కోరారు. ఇది చాలదన్నట్లుగా తాజాగా ఇండియా పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలతో ముడిపెట్టి ప్రచారం చేయడాన్ని తాలిబన్ తప్పుబట్టింది. ఈ విషయమై పాకిస్తాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

భారత్ పాకిస్తాన్‌ల మధ్య గొడవను ఇతర దేశాలకు ముడిపెట్టరాదని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పాడు. అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులను భారత్ పాక్‌లకు ముడిపెట్టి చూపడం వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం సమిసిపోదని ఆయన అన్నాడు. ఎందుకంటే అఫ్ఘానిస్తాన్‌లో వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని తెలిపారు. అంతేకాదు ఇండియా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధవాతావరణంకు దారితీసేలా అడుగులు వేయొద్దని తాలిబన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో జబీహుల్లా పేర్కొన్నారు. పాకిస్తాన్ పార్లమెంటులో ప్రతిపక్షనేత షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అఫ్ఘానిస్తాన్‌లను పోలుస్తూ ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో తాలిబన్ రియాక్ట్ అయ్యింది. కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుంటే అఫ్ఘానిస్తానీలు ఎలా సంతోషంగా ఉంటారు అని పాక్ ప్రతిపక్షనేత షెహబాజ్ ప్రశ్నించారు. ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

Taliban warns Pak for dragging Afghanistan into Kashmir issue

అఫ్ఘానిస్తాన్‌లో వాతావరణం ప్రశాంతంగా ఉందని కశ్మీర్ అంశంతో అఫ్ఘానిస్తాన్‌కు సంబంధం లేదని కాబుల్‌లోని పాక్ దౌత్యకార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్ఘానిస్తాన్‌లో చెలరేగుతున్న హింసకు కశ్మీర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ పాకిస్తాన్ దౌత్యాధికారి జాహీద్ నస్రుల్లా ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే సోమవారం రోజున జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Taliban has slammed Pakistan for linking heightened tensions between India and Pakistan over Kashmir with the situation in Afghanistan.Urging India and Pakistan not to turn Afghanistan into the 'theater of competition between other countries', Taliban spokesperson Zabihullah Mujahed said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X