అఫ్ఘానిస్థాన్‌లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతి
కాబూల్ : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్ ముర్గాబ్‌లో గల ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తూపాకుల మోత మోగించారు. ఈ నరమేధంలో 20 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్టు అప్ఘానిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల్లో కొందరు సైనికులు, మరికొందరు పోలీసులు ఉన్నారని వెల్లడించారు. మరికొందరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. ముర్గాబ్‌లో తాలిబన్లకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

చర్చలకు అవరోధం
అప్ఘనిస్థాన్ లో దాడి చేసింది తామేనని తాలిబన్ నేత యూసఫ్ అహ్మదీ ప్రకటన చేశారు. అప్ఘనిస్థాన్ లో తాలిబన్లతో అమెరికా ఓ వైపు చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో దాడులు జరుగడం చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.