వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చైనా మధ్య అసంపూర్తిగా చర్చలు: మరో దఫా డిస్కషన్స్‌ జరిగే ఛాన్స్..?

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా ఘర్షణకు సంబంధించి బుధవారం చర్చలు అసంపూర్తిగా జరిగాయి. ఈ అంశంపై విడతలవారీగా డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. చర్చల వల్ల తక్షణమే ప్రభావం కనిపించదని, భవిష్యత్‌లో మరిన్ని చర్చలు జరుగుతాయని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. సోమవారం రాత్రి తూర్పు లడాఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

Talks Between Major Generals of Both Nations Inconclusive..

సోమవారం 20 మంది భారతీయ సైనికులు చనిపోగా.. 1967లో జరిగిన ఘర్షణలో భారత్ 80 మంది సైనికులను కోల్పోయింది. అప్పుడు చైనా 300 మంది సైనికులు కూడా చనిపోయారు. బుధవారం చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యితో జై శంకర్ ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రమన ప్రభావం చూపిస్తోందని తెలిపారు. సోమవారం జరిగిన హింసకు చైనాయే కారణమని ఆయన పేర్కొన్నారు.

ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రుల ఫోన్ సంభాషణ తర్వాత.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి అని.. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు శాంతియుతంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో కలిసి మెలగాలని ప్రకటించాయి.

Recommended Video

#Lockdown : PM Modi Clarifies About Lockdown Extension

అంతర్జాతీయ సరిహద్దులో ఉద్రిక్త నేపథ్యంలో ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు. ఇరుగు పొరుగు దేశాలతో తాము శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నామని, అయితే తమ 3500 కిలోమీటర్ల సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు అని స్పష్టంచేశారు. దీంతో చైనా కూడా ఒక అడుగు తగ్గి.. పరిస్థితిని చల్లార్చే ప్రయత్నాలు చేసింది. తొలి దఫా బుధవారం చర్చలు జరిపింది. శాంతియుత వాతావరణం కోసం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.

English summary
Major Generals of India and China in Galwan Valley in Ladakh, the site of a violent face-off between the two armies, ended “inconclusive” on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X