వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షలో కాపీ కొట్టకుండా మరీ ఇలానా?: తలపై బాక్సులు, పేపర్లు!

|
Google Oneindia TeluguNews

మెక్సికో సిటీ: పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు మన దేశంలో చాలా రకాలుగా నిబంధనలు విధిస్తున్నారు. అయితే, మెక్సికోలో మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఓ టీచర్. పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఏకంగా వారి తలలకు కార్డ్ బోర్డులను తొడించారు. అమ్మాయిలకైతే తలకు రెండు పక్కలా పేపర్లను తగిలించారు.

కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?

తల్లిదండ్రుల ఆగ్రహం..

తల్లిదండ్రుల ఆగ్రహం..

ఈ బాక్సులు, కాగితాలతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. అయినా వారికి ఈ శిక్ష తప్పలేదు. అయితే, ఈ విషయం బయటికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడు, పాఠశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాక, ఈ ఘటనకు బాధ్యుడైన టీచర్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మేధోశక్తి పెరుగుతుందంటూ..

మేధోశక్తి పెరుగుతుందంటూ..


విద్యార్థుల హక్కులను కాపాడాలంటూ పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం విచిత్రంగా స్పందించింది. ఇలా చేయడం ద్వారా విద్యార్థుల సైకోమీటర్ డెవలప్‌మెంట్‌కి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇలా విద్యార్థుల తలలకు బాక్సులు, పేపర్లు పెట్టడం ద్వారా కాపీ కొట్టడం ఆగడంతోపాటు వారి మేధో శక్తి పెరుగుతుందని అంటున్నారు.

విద్యార్థులు అంగీకరించడంతోనే..

విద్యార్థులు అంగీకరించడంతోనే..


విద్యార్థుల సమ్మతించడంతోనే తాము ఈ విధంగా చేశామని పాఠశాల యాజమాన్యం వారి తల్లిదండ్రులకు తెలిపింది. తమకు మానవత్వపు విలువలు తెలుసని, విద్యార్థుల హక్కులను తాము గౌరవిస్తామని పేర్కొంది. ఏది ఏమైనా కాపీ కొట్టకూడదంటే ఇంత దారుణంగా వ్యవహరించాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
A high-school teacher from Mexico has sparked a controversy after she forced her students to wear cardboard boxes on their heads in order to stop them from cheating in exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X