వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ యువరాజుకు బైడెన్‌ ఝలక్‌- ట్రంప్‌ పెంచిన హోదా తగ్గింపు- సంబంధాలపైనా సమీక్ష

|
Google Oneindia TeluguNews

మధ్యప్రాచ్యంలో రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అందునా పశ్చిమ దేశాల జోక్యంతో అవి నిరంతరం కుదుపులకు లోనవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో ఏర్పడే ప్రభుత్వాల జోక్యం కారణంగా పశ్చిమాసియాలో దేశాలకు ఎప్పుడు వారి మద్దతు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పరిస్ధితి. ఇప్పుడు తాజాగా అమెరికా సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం కూడా సరిగ్గా ఇలాంటిదే.

అమెరికాలో డొనాల్ట్‌ ట్రంప్‌ సర్కారు హయాంలో పశ్చిమాసియా రాజకీయాల్లో వ్యూహాత్మక సంబంధాల కోసం సౌదీ అరేబియా రాజు, యువరాజుతో మంచి సంబంధాలు నెరిపేవారు. కానీ అమెరికాలో ప్రభుత్వం మారింది. వారి వ్యూహాలు కూడా మారాయి. దీంతో ఇప్పుడు సౌదీకి కష్టాలు వచ్చి పడ్డాయి. సౌదీలో ప్రస్తుతం అధికార వ్యవహారాలు చూస్తున్న యువరాజు మొహమ్మద్ బిన్‌ సల్మాన్‌తో సంబంధాలను పునస్సమీక్షించాలని, ఆయన హోదా కూడా తగ్గించాలని కూడా బైడెన్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Team Biden Downgrades Saudi Crown Prince To Recalibrate Ties

ట్రంప్‌ హయాంలో సౌదీలో అధికారం చెలాయిస్తున్న యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు ఆయన తండ్రి కింగ్ సల్మాన్‌ను కాదని అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు బైడెన్‌కు యువరాజు సమవుజ్జీ కాదని, ఆయన తండ్రి కింగ్ సల్మాన్‌ మాత్రమే తాము గుర్తిస్తున్నట్లు బైడెన్‌ సర్కారు తాజాగా ప్రకటించింది. అంతే కాదు యువరాజు సల్మాన్‌ స్ధాయిని అమెరికాలో డిఫెన్స్‌ సెక్రటరీ స్ధాయికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంటే అమెరికా లెక్కల ప్రకారం సౌదీ డిప్యూటీ ప్రధాని మరియు రక్షణ మంత్రి స్ధాయి మాత్రమేనని యూఎస్‌ తేల్చిచెప్పింది. మరోవైపు యెమెన్‌లో సాగుతున్న అంత్యర్ధుద్ధంలో సౌదీ పాత్ర తగ్గించుకుని మానవహక్కుల పరిరక్షణకు కట్టుబడాలని కూడా అమెరికా స్పష్టం చేసింది.

English summary
US President Joe Biden intends to “recalibrate” the US relationship with Saudi Arabia while emphasizing outreach to King Salman, in a move that signals a downgrade in ties with Crown Prince Mohammed Bin Salman, the country's de facto ruler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X