వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్: గ్రీన్ కార్డు రాకుంటే అంతే మరి..!

తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై భారీ ఆంక్షలు విధించింది. ప్రతిభావంతులైన నిపుణులకు అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాల్లోనే హెచ్1బీ వీసాదారులను అనుమతించాలని నిర్ణయించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : నారాయణన్ అనే విద్యుత్ ఇంజినీర్ అకస్మాత్తుగా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పూర్తిస్థాయి స్కాలర్ షిప్ లభించే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే తన జీవిత గమ్యాన్ని పూర్తిగా నిర్దేశిస్తుందని విశ్వసిస్తున్నాడు.

చెన్నైలో పుట్టి పెరిగిన నారాయణన్ బీటెక్ పూర్తి కాగానే తొలుత ఆయిల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా తోసిరాజని తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చాడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నారాయణన్ ప్రస్తుతం సిలీకాన్ వ్యాలీలోని డేటా సైన్స్ స్టార్టప్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కానీ ఐదేళ్లుగా అమెరికాలో శాశ్వత పౌరసత్వ హోదా కల్పించే గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

హెచ్ 1 బీ వీసాపై అమెరికాలో నివాసం ఉన్న నారాయణన్ వంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే ఉద్యగం పొందడం గానీ, సొంతంగా కంపెనీ ప్రారంభించడం గానీ అంత తేలిక కాదు. అదే నారాయణన్ వంటి వారు నాడు అమెరికాకు పరుగెత్తుకు రావడం బుద్ధి తక్కువ పని అని బాధ పడ్తున్నారు.

ప్రస్తుతం ఒక యూనివర్సిటీ స్కాలర్ షిప్ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన చెందుతున్నారు. గ్రీన్ కార్డు కోసం వాణి వినిపిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడిగా ఉన్నా ప్రయోజనం లేదని నారాయణన్ వాపోతున్నాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

పదేళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు

పదేళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు

హెచ్1బీ వీసాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో అమెరికాలోలో శాశ్వత పౌరసత్వం కల్పించే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నారాయణన్ వంటి లక్షల మంది భారతీయుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. సుమారు 15 లక్షల మంది హెచ్ 1 బీ వీసాహోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని వలసదారుల సంఘాలు చెప్తున్నాయి. వీరిలో అత్యధికులు భారతీయులే. వీరంతా దాదాపు పదేండ్ల నుంచి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారే.

హెచ్ 1 బీ వీసాకు గ్రీన్ కార్డుతో అనుబంధం ఇలా

హెచ్ 1 బీ వీసాకు గ్రీన్ కార్డుతో అనుబంధం ఇలా

తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై భారీ ఆంక్షలు విధించింది. ప్రతిభావంతులైన నిపుణులకు అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాల్లోనే హెచ్1బీ వీసాదారులను అనుమతించాలని నిర్ణయించింది. లాటరీ పద్ధతిలో హెచ్ 1 బీ వీసా జారీ చేయడానికి బదులు ప్రతిభావంతులకు తొలి ప్రాధాన్యం లభించనున్నది. దీంతో ఇప్పుడు హెచ్1బీ వీసాలపై ఉన్నవారు ఎవరైనా ఉద్యోగం కోల్పోయిన పక్షంలో కొత్తగా ఉద్యోగం దొరుకడం అసాధ్యమే. హెచ్1బీ, గ్రీన్‌కార్డుల వ్యవస్థ సాంకేతికంగా వేర్వేరు. కానీ.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందని భారత్ నుంచి వచ్చిన వలసదారులు పేర్కొంటున్నారు.

ప్రతిభావంతులకే గ్రీన్ కార్డు జారీ అంటే...

ప్రతిభావంతులకే గ్రీన్ కార్డు జారీ అంటే...

ఇప్పుడు ప్రతిభావంతులకే హెచ్ 1 బీ వీసా జారీ చేస్తామన్న ట్రంప్ ప్రభుత్వం.. తదుపరి దశలో గ్రీన్ కార్డు జారీ చేయడంలోనూ కూడా ప్రతిభకే పట్టం కడతామని చెప్పడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అనుకోండి. అది వేరే సంగతి. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్‌కార్డు రానిపక్షంలో తమకు తిరిగి భారత్‌కు వెళ్లిపోవడం మినహా మరో మార్గం లేదని ఐటీ నిపుణులు చెప్తున్నారు. వివిధ దేశాల వారీగా అతి కొద్ది శాతం మందికి మాత్రమే ప్రతియేటా అమెరికా గ్రీన్ కార్డు జారీ చేస్తుంది. గ్రీన్ కార్డుల జారీలో ఆయా దేశాల జనాభాతో నిమిత్తం ఉండదు. ఫలితంగా భారతీయులంతా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి బారులు తీరి నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

ఉద్యోగం పోతే ఎలా అని ఆందోళన

ఉద్యోగం పోతే ఎలా అని ఆందోళన

హెచ్1బీ వీసాలపై ఏండ్ల తరబడి పనిచేస్తున్న తాము ఒప్పంద కార్మికుల్లా మారిపోయామని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న గౌరవ్ మెహతా అనే ఎన్నారై చెప్పారు. మెహతాకు అమెరికాలో పుట్టిన కొడుకు ఉన్నాడు. అయితే.. పరిస్థితుల ప్రభావంతో ఉన్న ఉద్యోగం పోతే కొత్తగా అధిక వేతనం చెల్లించే ఉద్యోగం దొరకడం అసాధ్యమని, ఇక తిరిగి భారత్‌కు వెళ్లిపోక తప్పదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా గ్రీన్ కార్డు అందుబాటులోకి

ఇలా గ్రీన్ కార్డు అందుబాటులోకి

గురు హరిహరన్ అనే బూమరాంగ్ కామర్స్ అనే ‘ఇ - కామర్స్' స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇంతకుముందు అమెజాన్ డాన్ కాంలో ఎగ్జిక్యూటివ్‌గానూ, ఈ బే తదితర సంస్థల్లో పదేళ్లు పని చేశాడు. అప్పుడు గ్రీన్ కార్డు కోసం వేచి చూసిన హరిహరన్.. ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన వెంటనే గ్రీన్ కార్డు పొందాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దశాబ్ద కాలానికి పైగా ఆయా కంపెనీల్లో పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న భారతీయులు సకాలంలో గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే సదరు సంస్థలు నిర్ధాక్షిణ్యంగా తమను బయటకు పంపేస్తాయని ఆందోళన చెందుతున్నారు.

వెంచర్ కాపిటల్స్‌లోనూ ప్రతిభావంతులకే పెద్దపీట

వెంచర్ కాపిటల్స్‌లోనూ ప్రతిభావంతులకే పెద్దపీట

నితిన్ పచిసియా అనే హెచ్ 1 బీ వీసా హోల్డర్ ‘అన్ షాకిల్డ్ వెంచర్స్' పేరిట స్థాపించిన వెంచర్ క్యాపిటల్ వ్యవస్థాపక భాగస్వామిగా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఆచరణ యోగ్యమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ 1 బీ వీసా హోల్డర్లు కూడా సొంతంగా కంపెనీలు ప్రారంభించేందుకు అమెరికా ప్రభుత్వ ఆమోదం పొందేందుకు అవసరమైన చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. ఆయన వెంచర్ క్యాపిటల్‌కు ఆమోదం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ హెచ్ 1 బీ వీసా జారీ ప్రక్రియలో ప్రతిభావంతులకే అవకాశాలు కల్పించాల్సివస్తే.. ఉద్యోగాల కల్పనకు స్థాపించిన సంస్థలు కూడా తమ సంస్థల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను చేర్చుకోవడంపై ద్రుష్టి సారిస్తున్నట్లు నితిన్ పచిసియా తెలిపాడు.

English summary
When Gokul Gunasekaran was offered a full scholarship for a graduate programme in electrical engineering at Stanford University, he saw it as the chance of a lifetime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X