వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైరల్: పైలట్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం... వీడియో చూడండి

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మంటల్లో చిక్కుకున్న విమాన ప్రమాదం మరువక ముందే మరో విమాన ప్రమాదం మయన్మార్‌లో చోటుచేసుకుంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పే తప్పింది.

పనిచేయని ల్యాండింగ్ గేర్

మయన్మార్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే సందర్బంలో ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో పైలట్‌కు ఏమి చేయాలో తెలియలేదు. ఎంబ్రేర్ 190 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ల్యాండింగ్ సమయంలో గేర్ ఫెయిల్ అయ్యింది. దీంతో విమానం ముందు టైర్లు బయటకు రాలేదు. అయితే ఇక్కడే పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి విమానంను సురక్షితంగా ల్యాండ్ చేయడంలో సఫలీకృతులయ్యాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

చాకచక్యంతో వ్యవహరించిన పైలట్

ఇక విమానంను సురక్షితంగా ల్యాండ్ చేసి అంతమంది ప్రాణాలు కాపాడిన పైలట్‌ను పలువురు ప్రశంసించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. యాంగాన్ నుంచి మాండలేకు విమానం బయలుదేరిందని మయన్మార్ ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతికలోపం తలెత్తడంతో ముందు గేర్ పనిచేయలేదని తెలిపారు. అయితే పైలట్ రెండు సార్లు విమానశ్రయం పై చక్కర్లు కొట్టారని అధికారులు తెలిపారు. వెంటనే పైలట్ ఎమర్జెన్సీ సమయంలో పాటించాల్సిన నిబంధనలను పాటించారు. ఇంధనంను ఎక్కువగా ఖర్చు చేస్తే విమానం బరువు తగ్గుతుందని భావించి ఆ పని చేసినట్లు అధికారులు తెలిపారు.

వైరల్ అయిన వీడియో

వైరల్ అయిన వీడియో

ఇక విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. విమానం ముందుభాగం కిందకు రాకముందే వెనక చక్రాలు రన్‌వేను తాకేలా చేసి పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత విమానం ముందుభాగంతో అలానే మెల్లగా కొద్ది దూరం వరకు తీసుకెళ్లి విమానంను నిలిపివేశాడు. వెంటనే విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. అయితే 114 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో అధికారులు స్పష్టం చేయలేదు.

English summary
A Myanmar pilot safely landed a passenger jet without its front wheels on Sunday, after landing gear on the Myanmar National Airlines plane failed to deploy, the airline and an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X