వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ‘మనుషులను చంపేసి శరీర భాగాలను తింటాడు’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అతనో నరమాంస భక్షకుడు. మనషులను హత్య చేసి మరీ వారి శరీర భాగాలను తింటాడు. అతడే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అస్టిన్ హర్రౌఫ్ అనే యువకుడు మార్టిన్ కౌంటీ. అతనికున్న ఈ వికృతమైన అలవాటే అతడ్ని పోలీసులకు పట్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు మధ్యలో ఫ్లోరిడా వృద్ద దంపతులు హత్యకు గురయ్యారు. జాన్ స్టీవెన్స్, మిచెల్లీ మిష్కాన్ అనే వృద్ధ దంపతులను హత్య చేసిన తర్వాత, నిందితుడు వారి ముఖంపై, ఛాతిపై కొంత భాగాన్ని కొరికి తిన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. సరిగ్గా ఆ హత్యలు జరిగిన మరుసటి రోజు అస్టిన్ హర్రౌఫ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు.

అతడిని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. హర్రౌఫ్ అక్కడ వాంతికి చేసుకోగా కొన్ని ఆశ్చర్యకర నిజాలు వెల్లడయ్యాయి. అతడి నోటి నుంచి మనుషుల వెంటుకలు, శరీర భాగాల ముక్కలు రావడం గమనించారు. వైద్యులకు ఏదో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించారు.

Teen accused of biting dead man's face

పోలీసులు ఆస్పత్రిలోనే హర్రౌఫ్ ను విచారణచేయగా.. అది మనుషుల మాంసమేనని, తాను మనుషులను చంపి కొద్ది శరీరభాగం తింటానని సమాధానిమివ్వడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫ్లోరిడా దంపతుల హత్య తర్వాత దంతాలతో దారుణంగా స్టీవెన్స్ ముఖం, ఛాతి భాగాలపై కొరికి దాడి చేసి, కొంత భాగాన్ని తిన్నాడని మార్టిన్ కౌంటీ పోలీసు అధికారి విలియం స్నైడర్ తెలిపారు.

ఫ్కాక్కా అనే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా హర్రౌఫ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని భావిస్తున్నారు. అతడిని కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించిన తర్వాత మార్టిన్ కౌంటీ జైలుకు ఇటీవల తరలించినట్లు స్నైడర్ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

English summary
The Florida college student accused of killing a couple and chewing on the dead man’s face told deputies, “Help me, I ate something bad,” and then admitted it was “humans” as he spit out a piece of flesh, court documents show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X