వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావు కోసం ఆన్‌లైన్ పోలింగ్... చచ్చిపొమ్మన్న నెటిజన్లు.. యువతి ఆత్మహత్య.

|
Google Oneindia TeluguNews

నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన వారెవరైనా ఆత్మహత్య గురించి మాట్లాడితే వారిని ఓదార్చుతాం. ఆ ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. చచ్చి ఏం సాధిస్తావ్ బతికి అనుకున్నది సాధించమని జ్ఞానబోధ చేస్తాం. అయితే మలేషియాలో మాత్రం అలా నిస్పృహలో కూరుకుపోయిన ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రోత్సహించారు కొందరు నెటిజన్లు. చచ్చిపొమ్మంటూ సలహా ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యారు.

ఒక్కొక్క‌డు అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..లేదంటే జైలుకే! అలా అన‌లేదంటోన్న ఆ దేశాధ్య‌క్షుడుఒక్కొక్క‌డు అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..లేదంటే జైలుకే! అలా అన‌లేదంటోన్న ఆ దేశాధ్య‌క్షుడు

చావాలా? వద్దా?

చావాలా? వద్దా?

మలేషియాలోని సారావాక్ ప్రాంతానికి చెందిన ఓ 16ఏళ్ల టీనేజర్ డిప్రెషన్‌కు లోనైంది. ఈ క్రమంలో ఒకరోజు నేను చనిపోవాలి అనుకుంటున్నాను.. చనిపోవాలా? వద్దా? చెప్పండంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు సదరు యువతికి సర్ది చెప్పాల్సింది పోయి ఓ ఉచిత సలహా ఇచ్చారు. పోల్‌లో పాల్గొన్న వారిలో 69 శాతం మంది ఆ టీనేజర్‌ను చచ్చిపో అని సూచించారు. దీంతో ఆమె ఆ పోల్ స్క్రీన్ షాట్ తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కఠిన నిర్ణయం తీసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న టీనేజర్

ఆత్మహత్య చేసుకున్న టీనేజర్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల పోల్ ఒపీనియన్‌కు అనుగుణంగా సదరు యువతి చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. ఓ బిల్డింగ్‌పై నుంచి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒపీనియన్ పోల్‌లో ఆమెకు చచ్చిపొమ్మంటూ సలహా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఇన్‌స్టాగ్రామ్ పోల్ అనంతరం టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మలేషియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మలేషియా చట్టాల ప్రకారం మైనర్లను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి మరణ శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీని ప్రకారం ఆమెను ప్రోత్సహించిన వారందరికీ శిక్ష పడటం ఖాయమని తెలుస్తోంది.

English summary
A 16 year-old girl has reportedly killed herself in Malaysia, after posting a poll on her Instagram account asking followers if she should die or not, and 69% of responders voting that she should.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X