వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ లో బాలిక న్యూడ్ ఫోటో.. పరువు నష్టం దావా

|
Google Oneindia TeluguNews

ఐర్లాండ్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు న్యూడ్ ఫోటోల బెడద తప్పట్లేదు. మొన్నటికి మొన్న వియత్నాం దాడికి సంబంధించిన బాలిక న్యూడ్ ఫోటోను బ్లాక్ చేసి చిక్కుల్లో పడ్డ ఫేస్ బుక్.. తాజాగా ఐర్లాండ్ కు చెందిన ఓ మైనర్ బాలిక న్యూడ్ ఫోటోల విషయంలో మళ్లీ వివాదంలో ఇరుక్కుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి స్థానిక బాలికను బెదిరించి ఆమె న్యూడ్ ఫోటోలు సంపాదించాడు. అటు తర్వాత వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. అయితే ఆ ఫోటోలను బ్లాక్ చేయాల్సిన ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాలిక తరుపు న్యాయవాది ఫేస్ బుక్ మీద పరువు నష్టం దావా వేశారు.

Teenage girl sues Facebook over nude photo in landmark case

పలుమార్లు ఫేస్ బుక్ లో ఆ ఫోటో అప్ లోడ్ అయినా.. ఫేస్ బుక్ అధికారులు మాత్రం ఆ ఫోటోలను బ్లాక్ చేయకుండా వదిలేశారని బాలిక తరుపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. 2014 నవంబర్ మొదలు ఈ ఏడాది జనవరి వరకు సదరు బాలిక న్యూడ్ ఫోటో పలుమార్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని, దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫేస్ బుక్ వ్యవహరించిందని బాధిత బాలిక ఆరోపిస్తోంది. తన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ దుర్వినియోగం చేసినందుకు కోర్టును ఆశ్రయించింది బాలిక.

ఇదిలా ఉంటే.. బాధిత బాలిక ఆరోపణలను ఫేస్ బుక్ యాజమాన్యం కొట్టిపారేసింది. అయితే దీనిపై స్పందించిన బెల్ ఫాస్ట్ కోర్టు.. ఫేస్ బుక్ వ్యవహారాన్ని తప్పుబట్టింది. దీంతో ఫేస్ బుక్ పై భారీ జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
A teenage girl from Northern Ireland is suing the social network as well as the man who published the photo initially for failing to make blocking republication of the photo on the network a red line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X