• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాగ్రత్త: జంక్ ఫుడ్ తీసుకున్న ఈ కుర్రాడు చూపు కోల్పోయాడు

|

వర్షాకాలం సాయంత్రం వేళ అలా పానీ పూరీ తిందామనుకుంటున్నారా..? వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ లాగించేద్దామనుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. అలా జంక్ ఫుడ్ తింటున్నవారు జాగ్రత్తగా ఉండకపోతే.. మీ కంటి చూపు వినికిడి శక్తి మీ నుంచి దూరమవుతున్నట్లే. ఇది మేము చెబుతున్న విషయం కాదు.. శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రస్తావిస్తున్న అంశం.

సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?

 జంక్ ఫుడ్ తీసుకోవడంతో చూపును కోల్పోయిన కుర్రాడు

జంక్ ఫుడ్ తీసుకోవడంతో చూపును కోల్పోయిన కుర్రాడు

యూకేలో ఓ టీనేజీ కుర్రాడు ఇంటి ఆహారంకు దూరమయ్యాడు. ప్రతి రోజూ జంక్ ఫుడ్ తీసుకునేవాడు. ఉదయం టిఫిన్‌ నుంచి మొదలు పెడితే రాత్రి భోజనం వరకు అతని కడుపులోకి పోయేదంతా జంక్‌ఫుడ్డే. అది కూడా ఎక్కువగా ఫ్రై ఐటెమ్స్, చిప్స్ మాత్రమే ఆహారంగా తీసుకుంటుండేవాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. క్రమంగా ఆ కుర్రాడు చూపును కోల్పోయాడు. ఇదేంటని వైద్యుల దగ్గరకు వెళితే అతను తీసుకున్న బలహీనమైన ఆహారం, లేక జంక్ ఫుడ్ అతని చూపును దెబ్బతీశాయని వైద్యులు చెప్పారు.

జంక్ ఫుడ్‌తో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు

జంక్ ఫుడ్‌తో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు

జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని దీంతో పాటు శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని అనాల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.

 విటమిన్ బీ 12 లోపంతో బాధపడ్డ కుర్రాడు

విటమిన్ బీ 12 లోపంతో బాధపడ్డ కుర్రాడు

ఇక 14 ఏళ్ల వయస్సులో ఉన్న ఆ కుర్రాడు తనకు అలసట వస్తోందని చెబుతూ చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. ఆ కుర్రాడు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడిపోయాడు. రక్త పరీక్షలు చేయగా అతనికి అనేమియా ఉన్నట్లు తేలింది. అంతేకాదు విటమిన్ B12 లోపంతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక విటమిన్ బీ 12 కోసం ఇంజెక్షన్లు ఇచ్చారు. అంతేకాదు తన జీర్ణ వ్యవస్థ కోసం కూడా చికిత్స ఇచ్చారు. ఇక 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆ కుర్రాడికి క్రమంగా వినికిడి శక్తి కూడా కోల్పోయాడు. అయితే ఎంఆర్ఐ మరియు కంటి పరీక్షలు నిర్వహించగా జబ్బు ఎలా తలెత్తిందో కనుక్కోలేకపోయారు.

కళ్లను మెదడును అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ

కళ్లను మెదడును అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ

మరో రెండేళ్లకు కుర్రాడి కంటిచూపు మరింత మందగించింది. అబ్బాయికి 17 ఏళ్లు వచ్చేసరికి అతని కంటి చూపు 20/200గా చూపించింది. అంటే అమెరికాలో ఈ స్థాయిలో చూపు పడిపోతే కంటిచూపు పూర్తిగా కోల్పోయినట్లే లెక్కిస్తారు. ఇక మరింత కాలానికి అతని కళ్లను మెదడుకు అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ దెబ్బతిని ఉండటం వైద్యులు గమనించారు. అదే సమయంలో విటమిన్ బీ 12, తక్కువ మోతాదులో కాపర్, సెలీనియం, విటమిన్ డీలు ఉండటాన్ని గమనించారు. ఇక అనుమానం వచ్చిన డాక్టర్లు కుర్రాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడో ప్రశ్నించారు. దీంతో చూపు, వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం అబ్బాయి తీసుకుంటున్న జంక్ ఫుడ్ కారణమని తేల్చేశారు.

జంక్ ఫుడ్‌తో కొత్త జబ్బులు తెచ్చుకున్నట్లే అవుతుంది

జంక్ ఫుడ్‌తో కొత్త జబ్బులు తెచ్చుకున్నట్లే అవుతుంది

శరీరానికి విటమిన్ బీ 12 ఎంతో అవసరమని చెప్పిన వైద్యులు ఇదీ సరైన మోతాదులో లేకపోతే... శరీరంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని తద్వారా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు . పోషకాహారలోపం కారణంగా చూపు కోల్పోయినట్లయితే... దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే నివారించొచ్చని చెప్పారు. అయితే ఈ కేసులో మాత్రం కుర్రాడి చూపు ఎందుకు కోల్పోయాడో అని తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఎలాంటి కళ్ల జోడు ఉపయోగించినప్పటికీ లాభం లేదని చెప్పిన వైద్యులు కుర్రాడి మెదడుకు కళ్లను అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ దెబ్బతినిందని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A teen who ate nothing but fries, chips and other junk food for years slowly went blind as a result of his poor diet, according to a new report of the case.The case highlights a perhaps little-known fact about poor diets: In addition to being tied to obesity, heart disease and cancer, they "can also permanently damage the nervous system, particularly vision," according to the report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more