వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కెదురు: మోడీకి ఎందుకు రెడ్‌కార్నర్ నోటీసులు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ మనీ లాండరింగ్ కేసులో ఇంటర్‌పోల్ నుంచి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురైంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్‌పోల్ ఈడీని ప్రశ్నించింది.

ఈ మేరకు గత నెల 20న ఇంటర్‌పోల్ నుంచి ఈడీకి లేఖ కూడా అందింది. ఆర్ధిక నేరారోపణలను ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని భారత్‌కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

ఈడీ కూడా లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్‌పోల్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్‌పోల్ ప్రశ్నించింది.

Tell us why a red corner notice against Lalit Modi, Interpol asks Enforcement

ఈడీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను ఇంటర్‌పోల్‌కు సమర్పించింది. దేశపు అత్యున్నత విచారణ సంస్ధ రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే, దాన్ని ప్రశ్నించే హక్కు ఇంటర్‌పోల్‌కు లేదని ఇంటర్‌పోల్‌తో వ్వవహారలాను చక్కబెడుతున్న ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

సీబీఐ సూచనల మేరకే ఈడీ ఈ నోటీసులు ఇచ్చిందని, దీన్ని లియాన్‌లోని ఇంటర్‌పోల్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపామని, వారి నుంచి ఇటువంటి స్పందన వస్తుందని తాము ఊహించలేదని తెలిపారు. ఇంటర్‌పోల్ అనేది ఒక సులభతర ఏజెన్సీ అని చెప్పిన ఆయన, లలిత్ మోడీకి నోటీసులపై ఈ నెలాఖరులోగా ఇంటర్‌పోల్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం లలిత్ మోడీపై 16 కేసుల్లో విచారణ జరుగుతుండగా, వాటిల్లో 15 కేసులు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద నమోదయ్యాయి.

English summary
Interpol has sought reasons from the Enforcement Directorate (ED) on why a Red Corner Notice (RCN) should be issued against former IPL chief Lalit Modi who is facing a probe related to alleged money laundering in India. The RCN is an international lookout notice for a fugitive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X