• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొన్న అమెరికా.. నేడు రష్యా: ఒక్కడి కోసం లక్షలాదిమంది: దాడులు..ఘర్షణలు: ఏం జరుగుతోంది?

|

మాస్కో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఆయన మద్దతుదారులు వేలాదిమంది రోడ్డెక్కి, హింసాత్మక వాతావరణానికి కారణమైన ఉదంతాన్ని ప్రపంచం ఇప్పట్లో మరిచిపోలేదు. పదవీ కాలం ముగియబోయే చివరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొనేలా చేసిన ఘటన అది. దీనికి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే చల్లారుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అచ్చంగా అలాంటి సంఘటనలే రష్యాలో చోటు చేసుకున్నాయి. లక్షలాదిమంది రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. ఇది కాస్తా క్రమంగా హింసాత్మకంగా రూపుదాల్చేలా కనిపిస్తున్నాయి.

ఎందుకీ ఆందోళన..

రష్యా ప్రతిపక్ష నేత, అవినీతి వ్యవహారాలపై తరచూ ఉద్యమాలను నిర్వహించే అలెక్సీ నవాల్ని అరెస్ట్ ఉదంతం.. రష్యాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటైన రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పార్టీ నాయకుడాయన. అయిదు రోజుల కిందట జర్మనీ నుంచి వచ్చిన ఆయనను వ్లాదిమిర్ పుతిన ప్రభుత్వం.. అదుపులోకి తీసుకుంది. మాస్కో డొమొడేవొడొ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉంటున్నారు. నవాల్నీని అరెస్ట్ చేయడం పట్ల ఆయన మద్దతుదారులు లక్షలాది మంది నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జోరుగా కురుస్తోన్న మంచును సైతం లెక్కచేయట్లేదు.

మాస్కో సహా వంద నగరాల్లో..

మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ సహా రష్యా వ్యాప్తంగా ఈ ఆందోళనలు ఏకకాలంలో ప్రారంభం అయ్యాయి. లక్షలాది మంది నవాల్నీ మద్దతుదారులు, ఫ్యూచర్ ఆఫ్ ద రష్యా కార్యకర్తలు, అభిమానులు రోడ్డెక్కారు. వంద నగరాల్లో ఈ ఆందోళనలు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలను నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి- మాస్కో ఉద్రిక్తంగా మారింది. నగరవ్యాప్తంగా వేలాది మంది ఆందోళనకారులు అధికార భవనాల వద్ద బైఠాయించారు. పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు. నవాల్నీని నిర్బంధించిన కారాగారం వైపు ర్యాలీగా బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

3000 మందికి పైగా అరెస్టులు..

ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. పుష్కిన్ స్క్వేర్ వద్ద బైఠాయించిన వారిలో మూడువేలమందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జీ చేశారు. భారీ స్థాయిలో ఆందోళనలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్న సమయంలో చోటుచేసుకునే అరెస్టులను గుర్తించడానికి ఏర్పాటైన ఓవీడి-ఇన్ఫో అంచనా ప్రకారం. రష్యాలోని వేర్వేరు నగరాల్లో 2500 మంది అరెస్ట్ అయ్యారు.

నవాల్నీ భార్య సహా..

మాస్కోలో అరెస్టయిన వారిలో అలెక్సీ నవాల్నీ భార్య యులియా నవల్నాయా, సామాజిక కార్యకర్త ల్యుబోవ్ సొబోల్ ఉన్నారు. ఆమెతో పాటు 950 మందిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఆందోళనలు మరింత తీవ్రతరం కావడంతో పోలీసులు వారిని విడుదల చేశారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, కజాన్, వ్లదివొస్టోక్, వీల్కీనొవ్‌గొరోడ్, యెకెటెరిన్‌బర్గ్ వంటి అనేక నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రదర్శనకారులను నిరోధించడానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
Tens of thousands took to the streets in Russia on Saturday to protest against the arrest of opposition activist Alexey Navalny. Rallies were organised in several cities of Russia. However, violence was also reported in several parts including in Moscow and St Petersburg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X