వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల చిన్నారి చివరి కోరిక: పెళ్లి చేసుకోవాలని.. తల్లిదండ్రులు చేసేశారు

స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలేదె పాట‌ర్స‌న్ తల్లిదండ్రుల సాయంతో తనకంటే వయసులో ఏడాది పెద్దవాడైన తన బెస్ట్ ఫ్రెండ్ హారిస‌న్ గ్రియ‌ర్ ను పెళ్లాడి తన చివరి కోరికను తీర్చేసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

స్కాట్లాండ్: ఆ చిన్నారి వ‌య‌సు జ‌స్ట్ ఐదేళ్లు. పేరు.. ఇలేదె పాట‌ర్స‌న్. చూడ‌టానికి చాలా ముద్దుగా ఉంటుంది. కానీ.. ఏం చేస్తాం.. విధి వెక్కిరించింది. ఆ చిన్నారి ఈ లోకంలో ఉండడం దేవుడి కి ఇష్టం లేదు కాబోలు.. ఓ మాయ‌ రోగాన్ని ఆ చిన్నారికి అంటించాడు.

ఐదేళ్ల ప్రాయంలోనే ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది ఇలేదె పాట‌ర్స‌న్. న్యూరోబ్లాస్టొమా అనే మెద‌డుకు సంబంధించిన క్యాన్సర్ అది. ఎంత ట్రీట్ మెంట్ ఇచ్చినా బ‌త‌క‌డం క‌ష్టం అని డాక్ట‌ర్లు చెప్పారు.

eileidh-paterson

ఆ చిన్నారికి ఏమైనా కోరికలు ఉంటే తీర్చేయమని కూడా సూచించారు. కొండంత బాధను గుండెల్లోనే దిగమింగుకున్న ఆ తల్లిదండ్రులు కోరికలేమిటో చెప్పమని తమ చిన్నారిని అడిగారు.

తీరుస్తామని హామీ తీసుకున్న తరువాతే తన కోరికల చిట్టా విప్పిందా ఐదేళ్ల చిన్నారి. త‌న మొద‌టి కోరిక.. త‌న బెస్ట్ ఫ్రెండ్ హారిస‌న్ గ్రియ‌ర్ ను పెళ్లి చేసుకోవ‌డం. వినగానే ముందు నిర్ఘాంతపోయినా.. కొన్ని రోజుల్లో ఈ లోకాన్ని విడిచివెళ్లే తమ చిన్నారి కోరిక తీర్చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.

ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ల‌ను ఈ పెళ్లికి ఒప్పించారు. దీంతో ఆరేళ్ల త‌న బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లాడింది పాట‌ర్స‌న్. త‌న మిగిలిన కోరికల్లో.. డాల్ఫిన్స్ తో స్విమ్మింగ్ చేయ‌డం, వాట‌ర్ పార్క్ కు వెళ్ల‌డం, నిజ‌మైన మంచును చూడ‌టం, విమానంలో ప్రయాణించ‌డం లాంటివి ఓ ప‌ది ఉన్నాయి. ప్రస్తుతం ఆ కోరిక‌ల‌ను తీర్చుకునే పనిలో బిజీగా ఉందా చిన్నారి.

English summary
A TERMINALLY-ILL five-year-old girl has ticked off “dream wedding” from the top of her bucket list after a touching ceremony with her best friend.Brave Eileidh Paterson, who has the childhood cancer neuroblastoma, was joined by hundreds of well-wishers as she ‘married’ Harrison Grier, six, in a fairy tale-themed bash over the weekend. His dad Billy Grier, 31, said: “Harrison had never been to a wedding before, so this was all new to him.“But it was a beautiful ceremony and he enjoyed every minute. He was quite excited to do it. Ever since he met Eileidh, they have been inseparable.“I think he knew what was going on. He certainly knew how important it was to her and wanted to do whatever he could for her.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X