వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కంటే అమెరికా డేంజర్: మాస్టర్ మైండ్ సయీద్

|
Google Oneindia TeluguNews

లాహోర్: భారత్ మీద నిత్యం ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోయే జమాత్-ఉల్-దవా ఉగ్రవాద సంస్థ (జేయుడీ) చీఫ్, మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ నోటిలో నీతి వ్యాఖ్యాలు వస్తున్నాయి. అమెరికా కంటే భారతదేశంతో మనకు స్నేహం మంచిదని హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వానికి చెప్పాడు.

పాకిస్థాన్ ఇక ముందు అమెరికాతో స్నేహం చెయ్యరాదని, భారత్ తో స్నేహం చేస్తే మనకే మంచిదని అన్నాడు. ఇదే సందర్బంలో పాక్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. పాక్ పార్లమెంట్ లో కుర్చున్న నాయకులకు కాశ్మీర్ సమస్య ఎలా పరిష్కారం చెయ్యాలో ఆలోచించే తీరక లేదని విమర్శించాడు.

ఇలాంటి నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నాడు. పాకిస్థాన్ అక్రమితక కాశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు అనేక విధాలుగా స్పందిస్తున్నాయి.

Terror mastermind and Chief of JuD Hafiz Saeed

భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని, భారత్ లోని జలాశయాలు ధ్వంసం చేస్తామని జైష్-ఎ-అహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

అయితే ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జేయుడీ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ భారత్ తో మనం స్నేహం చెయ్యాలని పాక్ ప్రభుత్వానికి సూచించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. భారతదేశం కంటే అమెరికా చాల అపాయికారి దేశం అన్నాడు.

భారత్ తో పాక్ స్నేహం చెయ్యడానికి సిద్దం అవుతుంటే అమెరికా అడ్డుకుంటుందని ఆరోపించాడు. భారత్ తో స్నేహం చెయ్యడం మనకు అన్ని విధాలుగా మంచిదని పాక్ ప్రభుత్వానికి సూచించాడు. భారత్ కంటే మనకు అమెరికా పెద్ద శత్రవుగా మారిందని హఫీజ్ సయీద్ చెప్పాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

English summary
Terror mastermind and Chief of JuD Hafiz Saeed, called upon Pakistan to shift its focus from India to USA to build relationship, according to a report in India Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X