వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్‌లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మహేష్ సేననాయకే ఈ విషయాలను చెప్పారు. అయితే వారు ఎందుకు భారత్‌కు వెళ్లారో అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. భారత్‌లో శిక్షణ పొందేందుకు వెళ్లారా అన్న అనుమానం వ్యక్తమవుతోందని మహేష్ సేననాయకే చెప్పారు.

భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందా అన్న ప్రశ్నకు సమాచారం ఇచ్చారని చెప్పారు మహేష్ సేననాయకే. ఇప్పటికే భారత జాతీయ విచారణ సంస్థ తమిళనాడులో కేరళలో కొన్ని చోట్ల దాడులు చేసింది. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులతో ఇక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దాడులకు సంబంధం ఉన్న రియాస్ అబూబకర్‌ను అరెస్టు చేయడంతో తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్ ఆపరేట్ చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

Terrorists travelled to India for training days before blasts

ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో పలు చర్చీలు హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 253 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో ఇలాంటి ఉగ్రదాడి జరగడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. దాడుల వెనక తమ హస్తం ఉన్నట్లు ఐసిస్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

English summary
Some of the suicide bombers who carried out a series of blasts in Sri Lanka on Easter Sunday had travelled to India to possibly train in terrorism activities, the Sri Lanka Army chief has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X