• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా: పురుషుల వృషణాల్లోకి వైరస్.. అందుకే ఆడవాళ్లకంటే ఆలస్యంగా.. వీర్యంపైనా ఎఫెక్ట్

|

భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. ఇప్పటికే కేసుల సంఖ్య 25లక్షలు, మరణాలు 1.7లక్షలకు పెరిగాయి. అత్యధికంగా అమెరికాలో 42వేల మంది, ఇటలీలో 24 వేలు, స్పెయిన్ 21వేలు, ఫ్రాన్స్ 20వేలు, యూకేలో 17వేల మంది ప్రాణాలుకోల్పోగా, ఇండియాలో దాదాపు 600 మంది చనిపోయారు. కొవిడ్-19 కారణంగా కన్నుమూస్తున్నవాళ్లలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కరోనా ఆడవాళ్ల కంటే మగాళ్లనే ఎక్కువగా చంపుకుతినడానికిగల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

వృషణాలే అసలు సమస్య..

వృషణాలే అసలు సమస్య..

పురుషుల్లో వీర్యకణాలకు నిలయంగా, పునరుత్పత్తి గ్రంథిగా ఉండే వృషణాల వల్లే కరోనా కాటుకు అధికంగా గురవుతున్నట్లు సైంటిఫిక్ అధ్యయనంలో తేలింది. తొలిదశలో గొంతు, ముక్కు, ఊపిరితిత్తులపై దాడి చేసే వైరస్ కణాలు.. ఆయా భాగాలతోపాటు క్రమంగా వృషణాల్లోకి కూడా చొచ్చుకుపోయి, అక్కడ తిష్టవేసి ఎక్కువ కాలం ఉంటాయని వెల్లడైంది. ఈ కారణంగానే ఆడవాళ్లతో పోల్చుకున్నప్పుడు మరణాల రేటుగానీ, వ్యాధి నుంచి కోలుకునే సమయంగానీ ఎక్కువ ఉన్నట్లు రీసెర్చర్లు గుర్తించారు.

తల్లీకూతుళ్ల అధ్యయనం..

తల్లీకూతుళ్ల అధ్యయనం..

కరోనా వైరస్ పురుషుల్లో వృషణాలపై చూపించే ప్రభావంపై డాక్టర్ అదితి శాస్త్రి, ఆమె తల్లి డాక్టర్ జయంతి శాస్త్రిలు ముంబైలోని రోగులపై అధ్యనం చేశారు. అదితి ప్రస్తుతం న్యూయార్క్ లోని Montefiore మెడికల్ సెంటర్ ఆంకాలజీ విభాగంలో పనిచేస్తుండగా, జయంతి మాత్రం ముంబైలోని కస్తూర్బా ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈమధ్యే కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న 68 మందిపై అధ్యనం చేసిన విషయాలను వారు వెల్లడించారు.

అక్కడ ఆ శక్తి తక్కువ..

అక్కడ ఆ శక్తి తక్కువ..

క్రమపద్ధతిలో అందించే చికిత్సతో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఊపిరితిత్తులపై వరస్ ప్రభావాన్ని తగ్గిస్తారు. కానీ వృషణాల్లో మాత్రం ACE2 ప్రోటీనట్లతో వైరస్ గట్టి బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. పైగా వృషణాల్లో తక్కువ స్థాయి రోగనిరోధక శక్తి ఈ ప్రక్రియకు పరోక్షంగా తోడ్పడుతుంది. దీంతో మిగతా అవయవాల కంటే అక్కడ వైరస్ ఎక్కవ కాలం ఉంటుందని అధ్యయనంలో తేలింది. కొవిడ్-19 నుంచి మహిళలు యావరేజ్ గా 4 రోజుల్లో కోలుకుంటే.. పురుషులకు మాత్రం అందుకు 6రోజులుపైనే పడుతుంది.

  Lockdown : AP CM YS Jagan Urges Muslims To Do Ramzan Prayers @ Home
  XX.. వీర్యంపైనా ప్రభావం?

  XX.. వీర్యంపైనా ప్రభావం?

  సాధారణంగా పురుషుల కంటే స్త్రీలలో రోగనిరోధక శక్తి ఎక్కువ, స్త్రీలలో XX క్రోమోజోములు ఉండటం, పురుషుల్లో XY కాంబినేషనే ఇందుకు కారణమని, Y క్రోమోజోమ్ లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం చేత స్త్రీలతో పోల్చితే పురుషులు వైరస్‌ను ధీటుగా ఎదుర్కోలేరని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఎదుర్కోలేకపోతున్నారు'' అని తెలిపారు. అలాగే, కరోనా వైరస్‌ పురుషుల వీర్యంపైనా ప్రభావాన్ని చూపుతుందని, కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గి సంతాన సమస్యలు ఎదురవుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అమెరికాలో స్పెర్మ్ బ్యాంకులకు డిమాండ్ పెరిగింది. చైనా డాక్టర్లు కూడా ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికివి ప్రాధమిక అధ్యనాలే. వీటికి ఆమోదం లభించేదాకా మనం ఎక్కువగా కంగారు పడాల్సిన పనిలేదు.

  English summary
  The coronavirus could linger in the testicles, making men prone to longer, more severe cases of the illness, according to a new study. Dr. Aditi Shastri, and her mother, Dr. Jayanthi Shastri said so.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X