• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్‌ కల్చర్‌పై జో బైడెన్ సంచలన అడుగు

|

అగ్రరాజ్యం అమెరికాలో విచ్చలవిడి తుపాకి సంస్కృతికి చరమగీతం పాడాలన్న ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే మరో సామూహిక కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాదిలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోమారు నెత్తురు చిందింది. టెక్సాస్‌లోని బ్రయాన్‌ సిటీలో గల పారిశ్రామిక పార్కులో (స్థానిక కాలమానం ప్రకారం) గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పోలీస్ అధికారితోపాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే శిరసావహిస్తా -ఆపై సీఎం జగన్‌ను ప్రశ్నించను: ఎంపీ రఘురామవైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే శిరసావహిస్తా -ఆపై సీఎం జగన్‌ను ప్రశ్నించను: ఎంపీ రఘురామ

ఫర్నీచర్ తయారీ కంపెనీలో..

ఫర్నీచర్ తయారీ కంపెనీలో..

బ్రయాన్ సిటీలోని పారిశ్రామిక పార్కులో కెంట్‌మూర్‌ క్యాబినెట్స్‌ అనే ఫర్నీచర్ తయారీ వేర్ హౌజ్ లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిని సెయింట్‌ జోసెఫ్‌ హెల్త్‌ రీజనల్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఆ సంస్థలో ఉద్యోగే అని పోలీస్‌ చీఫ్‌ ఎరిక్‌ బుస్కే తెలిపారు.

viral video: గాడ్జిల్లా అనుకొని గజ్జున వణికారు -సూపర్‌ మార్కెట్‌లో భారీ బల్లి కలకలంviral video: గాడ్జిల్లా అనుకొని గజ్జున వణికారు -సూపర్‌ మార్కెట్‌లో భారీ బల్లి కలకలం

గంటల్లో నిందితుడి పట్టివేత

గంటల్లో నిందితుడి పట్టివేత

కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని, గ్రిమ్స్‌ కౌంటీలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సమయంలో పబ్లిక్‌ స్టేఫ్టీ ఆఫీసర్‌పై కాల్పులు జరిపాడని, కానీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే కాల్పులకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో పేట్రేగుతోన్న గన్ కల్చర్ ను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన సంస్కరణలపై టెక్సాస్ గవర్నర్ విమర్శలు చేసిన కొద్దిసేపటికే కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలో..

తుపాకీ.. ఇక అంత ఈజీ కాదు

తుపాకీ.. ఇక అంత ఈజీ కాదు

అమెరికాలో తుపాకీల సంస్కృతికి చెక్ పెట్టే దిశగా ప్రెసిడెంట్ జో బైడెన్ సంచలన అడుగు వేశారు. దేశంలో గన్స్‌ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్‌ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ‘‘గన్‌ వయలన్స్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎపడిమిక్‌'' పేరుతో రూపొందిన కొత్త నిబంధలనను వైట్ హౌజ్ అధికారికంగా జారీ చేసింది. తద్వారా దేశంలో తుపాకీలు పొందడం లేదా వాడటాన్ని కఠినతరం కానున్నాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించే ‘బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్,ఎక్స్‌ప్లోజివ్స్‌కు (ఏటీఎఫ్‌)'కు మాజీ ఫెడరల్‌ ఏజెంట్ డేవిడ్‌ చిప్‌మ్యాన్‌ను డైరెక్టర్ గా నియమిస్తూ బైడెన్ ఆదేశాలిచ్చారు. దీంతో..

నెల రోజుల్లో ఘోస్ట్ గన్స్ అంతు చూద్దాం

నెల రోజుల్లో ఘోస్ట్ గన్స్ అంతు చూద్దాం

అమెరికాలో ఘోస్ట్‌ గన్స్‌ తయారీని నియంత్రించడమే బైడెన్‌ తాజా సంస్కరణ ఉద్దేశంగా కనిపిస్తోంది. తుపాకీ విడి భాగాలను ఒక చోట అమర్చి ఇంట్లోనే తయారు చేస్తూ వీటిని యథేచ్ఛగా అమ్మేస్తూ ఉంటారు. ఘోస్ట్ గన్స్‌ రిజిస్టర్‌ అయినవి కావు. అలాంటి తుపాకులతో కాల్పులకు దిగితే అదెక్కడ తయారైందో తెలుసుకోవడం కష్టం. అందుకే ఈ తుపాకుల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ న్యాయశాఖని బైడెన్‌ ఆదేశించారు. ఇందుకోసం నెలరోజులు గడువు ఇచ్చారు. కాగా, తుపాకుల నియంత్రణకు బైడెన్ తీసుకొచ్చిన సంస్కరణలు పౌరుల వ్యక్తిగత భద్రత చట్టాలకు విరుద్ధమైనవని రిపబ్లికన్స్ విమర్శిస్తున్నారు.

English summary
Six people were shot, with one killed, Thursday afternoon at a cabinet-making business in Bryan, Texas, just outside of College Station, officials said. A Department of Public Safety officer was also shot while apprehending the suspect. President Joe Biden's new executive actions aimed at gun reform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X