వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్సాస్ లో నరమేథానికి ఉగ్రకుట్ర?: భగ్నం చేసిన పోలీసులు, టీనేజర్ అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఐసిస్ ఉగ్రకార్యకలాపాల పట్ల ఆకర్షితుడైన ఓ టీనేజర్.. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లోకి తుపాకులతో చొరబడి నరమేథం సృష్టించాలని ప్లాన్ చేశాడు. అతని పథకాన్ని ముందుగానే పసిగట్టిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.

నిందితుడిని ప్లానో వెస్ట్‌ సీనియర్‌ హైస్కూల్‌లో విద్యను అభ్యసిస్తున్న మాటిన్‌ అజిజీ యరాండ్(17)గా గుర్తించిన అధికారులు.. మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు అజిజీ యరాండ్ ఆయుధాల కొనుగోలు కోసం 1400డాలర్లను కొంతమందికి ఇచ్చినట్టు నిర్దారించారు.

Texas teen charged with plotting IS-inspired shooting at mall

గతేడాది డిసెంబర్‌లో ఎఫ్‌బీఐకు చెందిన నకిలీ ఉగ్రవాదుల యాప్‌ ద్వారా యరాండ్ సంప్రదింపులు కూడా జరిపినట్టు విచారణ అధికారులు తెలిపారు. ఐసిస్ ఆపరేషన్లకు సంబంధించి పలు పుస్తకాలను కూడా అతను అధ్యయనం చేసినట్టు గుర్తించారు.

భవిష్యత్‌లో పాకిస్తాన్‌ వెళ్లి అక్కడి నుంచి ఆప్ఘనిస్తాన్‌కు వెళ్లి ఐసిస్‌లో చేరాలనుకున్నట్టు యరాండ్ విచారణలో వెల్లడించాడని చెప్పారు. యరాండ్ పై ఉగ్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

English summary
A 17-year-old boy in Plano, Texas, has been arrested and charged with plotting a mass shooting inspired by the Islamic State at a shopping mall, law enforcement agencies said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X