• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుహ నుంచి బయటపడ్డ 6గురు: పెద్ద సాహసమే.. ఎలా బయటకొచ్చారంటే?

By Srinivas
|
  ఆపరేషన్‌లో పాల్గొన్న విదేశీయులు

  బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లల్లో సహాయక సిబ్బంది ఆరుగురిని రక్షించింది. ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆరుగురు బయటపడ్డారు. ఆదివారం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.

  థాయ్‌లాండ్ గుహలో 13 మంది, బయటకు ఎందుకు రాలేకపోయారు, ఏం జరిగింది?

  ఆరుగురు పిల్లలు వెలుపలకు సురక్షితంగా వచ్చారు. వారికి వైద్య సేవలు అందించేందుకు గుహ బయట ఫీల్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారిని కాపాడేందుకు వివిధ రకాలుగా ఆలోచనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈత నేర్పి తీసుకు రావడం, స్పేస్ ఎక్స్ అండ్ బోరింగ్ కంపెనీ అధినేత ఎలోన్ ముస్క్ ఓ ప్లాన్ చెప్పారు. మరోవైపు నీటిని తోడుతున్నారు.

  గుహలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుందనే ఆందోళనతో వారిని రక్షించేందుకు మరోవైపు కొండలను కూడా తొలుస్తున్నారు. గుహ పైభాగాన వంద చోట్ల రంధ్రాలు చేశారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల మేర తవ్వినా వారి జాడ కనిపించలేదు. కొండ పైభాగం నుంచి 600 మీటర్ల కంటే లోతులో వారు ఉండి ఉంటారని భావిస్తున్నారు.

  Thai cave rescue operation: Six boys rescued

  తొలుత వారిని రక్షించేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని భావించారు. ఆ తర్వాత వివిధ మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. గుహలో మరో ఏడుగురు మిగిలి ఉన్నారు.

  గుహలో ఉన్న మిగతా వారిని తీసుకువచ్చేందుకు అంటే రెండో విడత ఆపరేషన్ కోసం మరో 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది.

  ఆపరేషన్ ఎలా చేశారంటే?

  తొలి విడత ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ నిర్వహణ పెద్ద రిస్క్‌తో కూడినదే. విద్యార్థులు పెద్ద సాహసమే చేశారు. రెస్క్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన తాడును పట్టు విడవకుండా పట్టుకుని ఒకరి వెంట ఒకరు ఈదుకుంటూ వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను మోస్తూ మలుపులు, ఎత్తుపల్లాలతో ఉన్న దారిలో 4కి.మీ.కు పైగా ఈదుతూ బయటపడ్డారు. వీరికి ముందో డైవర్, వెనకవైపు ఓ డైవర్ వారిని పర్యవేక్షిస్తూ ఒడ్డుకు చేర్చారు.

  వారు వచ్చిన మార్గంలో ఓచోట వెడల్పు కేవలం పదిహేను అంగుళాలు మాత్రమే ఉండడంతో విద్యార్థులు, రెస్క్యూ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. అంతేకాదు, మరోచోట నీటి అడుగు నుంచి ఏకంగా కి.మీ. దూరం ఈదవలసి వచ్చింది.

  ఆపరేషన్‌లో విదేశీయులు

  ఆపరేషన్‌లో 90 మంది డైవర్స్ పాల్గొన్నారు. ఇందులో విదేశీయులు 50 మంది పాల్గొన్నారు. 13 మంది ఇంటర్నేషనల్ కేవ్ ఎక్స్‌పర్ట్స్, ఐదుగురు థాయి నావీ సీల్స్ గుహలోకి వెళ్లారు. వారి సహకారంతో 6గురు బయటపడ్డారు. జూన్ 23న గుహలో చిక్కుకున్న వారు పదహారు రోజుల తర్వాత నేడు జూలై 7న బయటకు వచ్చారు.

  English summary
  Six boys out of the 13 people trapped inside a cave in Thailand have been rescued so far, said reports. Four of the rescued boys have been admitted to a hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X