వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్కంటే ఈమెదే: నాడు రాజు వద్ద సిబ్బంది ... నేడు అదే రాజ్యానికి 'మహారాణి'

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: ఒక దేశానికి ఆయన రాజు... రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రపంచదేశాల అందాల భామలు ఆయన ముందు వాలిపోతారు. కానీ మన కథలో రాజు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అతని దగ్గర పనిచేసే సామాన్య మహిళను వివాహమాడారు. అంతేకాదు ఆమెను ఏకంగా ఆదేశానికి మహారాణిగా ప్రకటించారు. ఇంతకీ ఆ రాజు ఎవరు... తాను పెళ్లి చేసుకున్న మహిళ ఎవరు.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 తన వద్ద పనిచేసే మహిళనే వివాహమాడిన థాయ్ రాజు

తన వద్ద పనిచేసే మహిళనే వివాహమాడిన థాయ్ రాజు

థాయ్‌లాండ్.. ప్రపంచ పటంలో ఓ చిన్న దేశం. ఆ దేశానికి రాజు మహా వజిరలాంగ్కోన్. ఇక కొద్దిరోజుల్లో అధికారికంగా పట్టాభిషిక్తుడు కానుండగా అందరికీ ఆయన పెళ్లి కబురు చెబుతూ షాక్ ఇచ్చారు. ఎప్పుడూ తన పాదాల దగ్గర సేవ చేసుకుంటూ ఉండే ఓ సామాన్య మహిళను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆయన తలచుకుంటే ఎందరో సౌందర్యలహరిలు క్యూలైన్లో నిల్చుంటారు. కానీ వారందరినీ కాదని రాజు దగ్గర వ్యక్తిగత భద్రతా సిబ్బందికి డిప్యూటీ హెడ్‌గా పనిచేస్తున్న మహిళను పెళ్లాడారు. అంతేకాదు ఆమెకు మహారాణి హోదా కల్పిస్తూ అధికారిక ప్రకటన కూడా చేసేశారు.

 బౌద్ద, బ్రాహ్మణ మత ప్రకారం అధికారికంగా పట్టాభిషేకం

బౌద్ద, బ్రాహ్మణ మత ప్రకారం అధికారికంగా పట్టాభిషేకం

థాయ్ రాజు మహావజిరాలాంగ్కోన్ ఇకపై దేశానికి రాణిగా తను వివాహమాడిన మహిళ ఉంటారని పేర్కొంటూ థాయ్ రాయల్ గెజిట్‌లో కూడా పొందుపర్చారు. థాయ్ రాజు పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలను ఆదేశంలోని పలు టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. 66 ఏళ్ల మహావజిరాలాంగ్కోన్‌కు పదవ కింగ్ రామా అనే బిరుదు కూడా ఉంది. తన తండ్రి కింగ్ భూమిబోల్ అదుల్ యాదేజ్ 2016 అక్టోబర్‌లో కాలం చేసిన తర్వాత అప్పటి నుంచి మహావజిరాలాంగ్కోన్‌ ఆ దేశానికి తాత్కాలిక రాజుగా వ్యవహరిస్తున్నారు. ఇక శనివారం అధికారికంగా మహావజిరాలాంగ్కోన్ పట్టాభిషేకం ఘనంగా జరగనుంది. ఈ వేడుక బౌద్ద, బ్రాహ్మణ మత ప్రకారం జరగనుంది. ఆ తర్వాత బ్యాకాంక్‌లో భారీ ఊరేగింపు జరగనుంది.

మహారాణి ఒక ఎయిర్ హోస్టెస్

మహారాణి ఒక ఎయిర్ హోస్టెస్

థాయ్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హాస్టెస్‌గా పనిచేస్తున్న సుతిద తిడ్‌జాయ్ అనే మహిళను తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి డిప్యూటీ కమాండెంట్‌గా రాజు మహావజిరాలాంగ్కోన్ 2014లో నియమించారు. ఎప్పుడైతే రాజు సుతిదను నియమించారో ఇక అప్పటి నుంచి ఇద్దరిపై పలు ఆరోపణలు లేదా పుకార్లు గుప్పుమన్నాయి. ఇద్దరి మధ్య ఏదో సంబంధం నడుస్తోందనే వార్తలు థాయ్‌లాండ్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై రాజప్రసాదం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అదే సమయంలో వార్తలను ఎవరూ ఖండించలేదు. ఇక 2016లో రాయల్ థాయ్ ఆర్మీకి సుతిదను పూర్తిస్థాయి జనరల్‌గా నియమించారు. ఆ తర్వాత 2017లో ఆమెను తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి డిప్యూడీ కమాండర్‌గా నియమించి మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ప్రథమ మహిళగా కూడా ప్రకటించారు.

ఒక దేశానికి చెందిన రాజు పెళ్లి అంటే ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఆకాశమంత పందిరి భూదేవి అంత పీట వేసి చాలా ఘనంగా జరిగింది. ప్రపంచదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే రాజు మహావజరాలాంగ్కోన్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారందరికీ విడాకులు ఇచ్చేశాడు. వీరి ద్వారా ఆయనకు కలిగిన సంతానం ఏడుగురు.

English summary
Just days before his official coronation, Thailand's King Maha Vajiralongkorn on Wednesday married the deputy head of his personal guard force and gave her the title Queen Suthida.The surprise announcement was carried in the Royal Gazette, and footage from Wednesday's wedding ceremony was later shown on the nightly Royal News segment aired on all Thai television channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X