వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌లాండ్ కేవ్ ఆపరేషన్: 12 మంది బాలురు, కోచ్ బయటపడ్డారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

Thailand Cave Rescue : All 12 Boys Are Successfully Rescued

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ పూర్తయింది. మూడు రోజులుగా వారిని బయటకు తీసుకు వచ్చేందుకు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు పదకొండు మందిని రక్షించారు. ఆ తర్వాత మరో బాలుడిని, కోచ్‌ను వెలుపలకు తీసుకు వచ్చారు.

మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల వల్ల పన్నెండు మంది బాలురు, కోచ్ బయటకు వచ్చారు. వాతావరణం అనుకూలించడంతో ఈ రోజు మిగతా వారిని బయటకు తీసుకు వచ్చారు. 8వ తేదీన నలుగురిని, 9వ తేదీన నలుగురిని, 10వ తేదీన ఐదుగుర్ని రక్షించారు..

గుహలోని వారిని కాపాడేందుకు మినీ సబ్‌మెరైన్.. అద్భుతం: ఒళ్లు గగుర్పొరిచే సాహసం (వీడియోలు) గుహలోని వారిని కాపాడేందుకు మినీ సబ్‌మెరైన్.. అద్భుతం: ఒళ్లు గగుర్పొరిచే సాహసం (వీడియోలు)

గుహ నుంచి బయటకు వచ్చిన పన్నెండు మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని బయటకు తీసుకు రాగానే వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫోనల్ చూసేందుకు తమకు టీవీలు ఏర్పాటు చేయాలని చిన్నారులు డాక్టర్లను కోరారు. 90 మంది డైవర్స్‌తో రెస్కూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Thailand cave rescue: 11th boy rescued as mission to free last child and coach continues

బయటపడిన బాలురు ఆరోగ్యంగానే ఉన్నారు. వారు ఇన్ని రోజులు చీకటిలో ఉండటంతో భయాందోళనతో గడిపారు. దీంతో మానసికంగా ఇబ్బంది పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.

అద్దాల గోడల నుంచి తల్లిదండ్రులకు చూపించే అవకాశముంది. ఇదిలా ఉండగా, ఈ గుహలో చిక్కుకుపోయిన చోటుకు హాలీవుడ్ నిర్మాతలు వస్తున్నారట. దీనిపై సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారట.

English summary
All twelve boys and their coach have been rescued, after being trapped in a cave in Thailand for 18 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X