• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో వైరల్ :ఆరోజున ప్రధాని ఏం చేయమన్నారు... ఇప్పటికే ఆ దేశ ప్రజలు చేస్తున్నారు

|

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో తిరగకుండా ఇళ్లకే పరిమితమౌతే చాలా సహాయం చేసినవాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా ఈ మహమ్మారికి కళ్లెం వేయొచ్చని మోడీ చెప్పారు. అదే సమయంలో కరోనావైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని చెప్పారు. ఇక మార్చి 22 ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆరోజు ఏమి చేయాలో కూడా ప్రధాని చెప్పారు.

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
  మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలి

  మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలి


  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు జనతా కర్ఫ్యూను పాటించాలని చెప్పిన ప్రధాని మోడీ... ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఇళ్ల బాల్కానీల నుంచి కరోనావైరస్ పై పోరాటం చేస్తున్న మెడికల్ సిబ్బందికి, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా చప్పట్లు లేదా సెల్యూట్ చేయాలని చెప్పారు. అయితే ప్రధాని దేశానికి ఇచ్చిన ఈ ఐడియా ఇప్పటికే పలు దేశ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

  మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఇటలీ ప్రజలు

  చైనాలో పుట్టుకువచ్చిన ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు పాకింది. కరోనావైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. ఇక మృతుల సంఖ్యను పరిశీలిస్తే ఇటలీలో మృతుల సంఖ్య చైనాను దాటేసింది. ఇటలీలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనావైరస్ బారిన పడిన వారికి సేవలందిస్తూ వారు కూడా ఈ మహమ్మారికి చిక్కుతున్నారు. అలాంటి త్యాగాలు చేసే వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటలీ ప్రజలు తమ ఇళ్లల్లోని బాల్కానీల నుంచి ఫ్లాష్ మాబ్‌ ద్వారా పాటలు పాడారు. ఇప్పుడు ఫ్రాన్స్, స్పెయిన్ ప్రజలు కూడా తమ హెల్త్ కేర్ వర్కర్లకు ఇదే విధమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ విపత్కర సమయంలో వారు చేస్తున్న సేవలను చూసి నిజమైన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు ఇలా ధన్యవాదాలు తెలుపుతూ ట్విటర్‌పై పోస్టులు చేస్తున్నారు.

  కష్టసమయాల్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ..

  ఇక యూరోప్ దేశాలు దాదాపు షట్‌డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈ కష్ట సమయాల్లో ప్రజలంతా ఒకే తాటిపైకొచ్చి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. ఇది తమను బలోపేతం చేస్తోందని చెబుతున్నారు. ఫ్రాన్స్ స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఆ దేశపౌరులు తమ ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచి కోవిడ్-19 బాధితులకు సేవలు అందిస్తున్న వారిని చప్పట్లతో అభినందించారు. స్పెయిన్‌లో కూడా ఇదే రకమైన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. మెడికల్ సిబ్బందిని ,హెల్త్ వర్కర్లు కరోనావైరస్‌పై పోరాడుతున్న తీరును అభినందించారు.

  సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు

  ఇక ఇతర దేశాల్లో ఉన్నవారికి కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న మెడికల్ సిబ్బందిని అభినందించాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇంటి బాల్కనీ వద్దకు వెళ్లి చప్పట్లతో, లేదా కేకలు పెట్టి లేదా పాటలు పాడి లేదా గంటలు మోగించి అభినందించాలని పిలుపునిచ్చారు. వారు చేస్తున్న సేవను గుర్తించి వారు లేకుంటే ఇవ్వాళ మనము లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వారిని అభినందించాలని పిలుపు నిచ్చారు. ప్రధాని మోడీ కూడా ఇదే రకంగా జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

  పాటలు పాడటం, మ్యూజిక్‌లతో...

  పాటలు పాడటం, మ్యూజిక్‌లతో...

  ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో ఇప్పటికే అక్కడి ప్రజలు వేలసంఖ్యలో తమ సంఘీభావం తెలిపారు. ఈ కష్టసమయంలో యూరోప్ మొత్తం కలిసి ఉందని చాటుదామంటూ పిలుపునిచ్చారు. గతవారం ఇటలీ ప్రజలు తమ బాల్కానీల నుంచి పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం ద్వారా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం బాల్కానీల్లోకి చేరి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

  English summary
  Amid the coronavirus outbreak PM Modi gave a call to show solidarity with the medical staff by clapping, saluting and ringing bells on the Janatha curfew day on March 22nd. This is been already being followed by Italy, France and Spain.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X