వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..

ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే టూరిస్టులకు సియోల్ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Top-5 Amazing Facts About South Korea టాప్-5 షాకింగ్ విషయాలు.. | Oneindia Telugu

సియోల్: ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కాస్మోపాలిటన్ హబ్‌లో సియోల్ తనకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది.

ఐదు కోట్ల జనాభాను కలిగి ఉన్న ఈ చిన్న దేశం.. అభివృద్దిలో మాత్రం అనితర సాధ్యమనే రీతిలో దూసుకుపోయింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే టూరిస్టులకు సియోల్ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. అలాంటి సియోల్ గురించి చాలామంది ఇండియన్స్‌కు తెలియని విశేషాలు ఇక్కడ చూద్దాం.

 మినీ స్కర్ట్స్ కల్చర్:

మినీ స్కర్ట్స్ కల్చర్:

దక్షిణ కొరియా అమ్మాయిలంతా ఎక్కువగా స్కర్టులనే ధరిస్తారు. 'నో ప్యాంట్స్' సంస్కృతి ఇక్కడ చాలా పాపులర్. మినీ స్కర్టులను ధరించడానికే వారు ఇష్టపడుతారు. ప్రతీ అమ్మాయి చేతిలో కచ్చితంగా న్యూస్ పేపర్ లేదా హ్యాంగ్ బ్యాగ్ ఉండి తీరుతుంది.

మెట్లు ఎక్కుతున్నప్పుడో.. లేక నడుస్తున్నప్పుడో.. ఎవరైనా తమను అసభ్యంగా చూస్తున్నారనుకుంటే.. వీటిని అడ్డుపెట్టుకుని కవర్ చేసుకుంటుంటారు. ఇక్కడ మినీ స్కర్టు ఎంత పాపులరో.. క్లీవేజ్ షో అంత అనైతికతగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతీ అమ్మాయి డీసెంట్ టాప్స్ ను ధరించడం ఇక్కడ గమనించవచ్చు.

 తాగడంలో వీళ్లను మించినవాళ్లు లేరు:

తాగడంలో వీళ్లను మించినవాళ్లు లేరు:

వెస్టర్న్ ప్రజలే మద్యం ఎక్కువగా సేవిస్తుంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ దక్షిణ కొరియా ప్రజల ముందు వారు దిగదుడుపే. ఎవరైనా మందు ఆఫర్ చేస్తే.. దాన్ని తిరస్కరించడం ఇక్కడ అనైతికతగా పరిగణిస్తారు. కాబట్టి మద్యపానం అనేది ఇక్కడ అత్యంత కామన్.

సోజు అనే లోకల్ బ్రాండ్ ఆల్కాహాల్ ను ఇక్కడి ప్రజలు ఎక్కువగా సేవిస్తుంటారు. ప్రతీ ఏటా ఆల్కాహాల్ వినియోగంలో దక్షిణ కొరియా తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటోంది. అలా ఈ భూగ్రహం మీద తాగడంలో దక్షిణ కొరియన్లను మించినవాళ్లు లేరనే అనే వాదన కూడా ఉంది.

 లవ్ మోటల్స్:

లవ్ మోటల్స్:

బహిరంగ ప్రాంతాల్లో రొమాన్స్ అనైతికతగా భావిస్తారు. అందుకే జంటల కోసం ఇక్కడ లవ్ మోటల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రేమలో ఉన్నవారెవరైనా లవ్ మోటల్స్ గదులను ఉపయోగించుకోవచ్చు. గంటలు, రాత్రుల లెక్కన ఛార్జీలు వసూలు చేస్తారు. లవ్ మోటల్స్ అన్ని శుభ్రంగా, అందంగా అలంకరించి ఉంటాయి. సియోల్ నగరంలోని దాదాపు ప్రతీ ప్రాంతంలో లవ్ మోటల్స్ దర్శనమిస్తాయి.

చేతిలో చెయ్యేసి నడవడం:

చేతిలో చెయ్యేసి నడవడం:

ఇద్దరు మగవాళ్లు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని రాసుకుని, పూసుకుని తిరుగుతుంటే.. చూసేవాళ్లెవరైనా సరే 'గే' అనే అనుకుంటారు. కానీ సియోల్ లో అలా కాదు. ఒక అబ్బాయి ఒడిలో మరో అబ్బాయి కూర్చోవడం, అతని వెంట్రుకలను సరిచేయడం ఇక్కడ చాలా కామన్ గా కనిపిస్తుంటుంది. దీన్ని తప్పుగా భావించరు.

ఇలాంటిది ఒక్క దక్షిణ కొరియాలోనే:

ఇలాంటిది ఒక్క దక్షిణ కొరియాలోనే:

'మలం' అన్న పేరు వినగానే చాలామందికి డోకు వచ్చినంత పనవుతుంది. కానీ దక్షిణ కొరియన్లకు అలా కాదు. వాళ్లు దాన్నో హాస్య వస్తువుగా పరిగణిస్తారు. అందుకే మొబైల్స్, టాయ్స్, కేకులు, ఇంకా చాలా రకాల వస్తువులను ఆ షేప్‌లో తయారుచేసి విక్రయిస్తుంటారు. వీటికి అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కల్చర్ ప్రపంచం మొత్తంలో ఒక దక్షిణ కొరియాలో మాత్రమే కనిపిస్తుంది.చాలావరకు ఇక్కడి పబ్లిక్ టాయిలెట్స్ అన్ని లగ్జరీగా ఉంటాయి. టాయిలెట్స్ లో సైతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 'ప్లే' చేస్తుంటారు.

English summary
Having been named the world’s top design capital in 2010 and playing well-paying host to thousands of ESL teachers every year, tourism to South Korea has been steadily on the rise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X