వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్నీ! అంతరిక్షంలో సన్నివేశాల చిత్రీకరణ కోసం ఏకంగా స్పేస్‌కు వెళ్లొచ్చిన యూనిట్

|
Google Oneindia TeluguNews

మాస్కో: అంతరిక్షం, అక్కడ చోటు చేసుకునే అద్భుతాలను కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన అనేది ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే.. ఉత్కంఠతను రేకెత్తించేదే. దీన్ని బేస్ చేసుకుని రూపొందించిన సినిమాలు హాలీవుడ్‌లో ఎన్నో వచ్చాయి. బాలీవుడ్‌‌లోనూ సందడి చేశాయి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం..9000 కిలోమీటర్లు, తమిళంలో జయం రవి లీడ్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన టిక్ టిక్ టిక్.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయి.

హాలీవుడ్‌లో ఎన్నో..

హాలీవుడ్‌లో ఎన్నో..

ఇక హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలకు లెక్కే లేదు. స్టార్ వార్స్, గార్డియన్ ఆఫ్ గెలాక్సీ, స్టార్ ట్రెక్, అపోలో 13, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇంటర్‌స్టెల్లార్, ది ఏలియన్స్, ది ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్, గ్రావిటీ, అపోలో 11, స్పీసిస్, ఆర్మ్‌గెడాన్, వాల్ ఈ వంటి పలు సినిమాలు కుప్పలు తెప్పలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా స్టూడియోల్లో వేసిన సెట్టింగ్స్‌లల్లో చిత్రీకరణకు నోచుకున్నవే. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కినవే.

ది ఛాలెంజ్ మూవీ కోసం అంతరిక్షంలో షూటింగ్..

తాజాగా సెట్స్ మీద ఉన్న ది ఛాలెంజ్ మూవీ మాత్రం దీనంతటికీ పూర్తి భిన్నమైనది. రష్యా ఫిల్మ్ మేకర్స్ చిత్రీకరిస్తోన్న సినిమా ఇది. ఇది కూడా అంతరిక్ష పరిశోధనలను ఆధారంగా తీసుకుని తీస్తోన్నదే. అందుకే- కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి మూవీ యూనిట్.. ఏకంగా అంతరిక్షానికే వెళ్లొచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉంటూ ఆ సన్నివేశాలను చిత్రీకరించింది. 191 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో గడపాల్సి వచ్చింది. సినిమాకు కావాల్సిన సన్నివేశాలను 12 రోజుల పాటు చిత్రీకరించారు.

అంతరిక్ష కేంద్రంలో సన్నివేశాలు..

అంతరిక్ష కేంద్రంలో సన్నివేశాలు..

ది ఛాలెంజ్ మూవీ దర్శకుడు క్లిమ్ షిపెన్కో, నటి యూలియా పెరెసిల్డ్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లొచ్చారు. స్పేస్ స్టేషన్‌లో అనారోగ్యానికి గురైన ఓ అంతరిక్ష పరిశోధకుడికి చికిత్సను అందించడానికి ఓ డాక్టర్ అక్కడికి వెళ్లడానికి సంబంధించిన సన్నివేశాలు అవి. దీనికోసం నిజమైన ఆస్ట్రోనాట్లనే నటింపజేశారు ఈ మూవీలో. స్పేస్ స్టేషన్‌లో పని చేస్తోన్న రష్యాకు చెందిన ఆస్ట్రోనాట్స్ ష్కప్లెరోవ్, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు సపోర్టింగ్ రోల్‌లో నటించారు.

భూమికి తిరిగొచ్చిన దర్శకుడు, నటి..

సన్నివేశాల చిత్రీకరణ ముగించుకుని స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన దర్శకుడు క్లిమ్ షిపెన్కో, నటి యూలియా పెరెసిల్డ్ రష్యా కాలమానం ప్రకారం.. ఈ ఉదయం భూమికి చేరుకున్నారు. వారిని మోసుకొచ్చిన అంతరిక్ష వాహక నౌక సూయెజ్ ఎంఎస్-18.. గ్రీన్ విచ్ మీన్ టైమ్ ప్రకారం.. 4:36 నిమిషాలకు కజకిస్తాన్‌లో ల్యాండ్ అయింది. రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. చిత్రీకరణ ముగించుకుని ఇవ్వాళ భూమికి చేరుకున్నారు.

Recommended Video

Taliban Is All Set To Form New Government In Afghanistan, Russia China And Pak Among Invitees
మిషన్ ఇంపాజిబుల్-4 కూడా..

మిషన్ ఇంపాజిబుల్-4 కూడా..

అంతరిక్షంలో షూటింగ్ జరుపుకొన్న మొట్టమొదటి సినిమాగా.. ది ఛాలెంజ్ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టయింది. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించాల్సి ఉన్న మిషన్ ఇంపాజిబుల్-4 కూడా అంతరిక్షంలో చిత్రీకరించాల్సి ఉంది. దీనికోసం చిత్రం యూనిట్ నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్‌తో టైఅప్ అయింది. కాగా- ది ఛాలెంజ్ సినిమా కథ ఏమిటి? బడ్జెట్ ఎంత అనేది బహిర్గతం కాలేదు. ఈ విషయాలను చిత్రం యూనిట్ రహస్యంగా ఉంచింది.

English summary
The Challenge, Russian film crew aboard the International Space Station, including actress Yulia Peresild and film director Klim Shipenko, returned to Earth on Sunday, October 17, after spending 12 days in space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X