వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌కు పెద్ద టెన్షన్!50 ఏళ్లలో వర్చువల్ స్మశానంలా ఎఫ్‌బీ!యాక్టివ్ యూజర్ల కన్నా పెరగనున్న డెడ్

|
Google Oneindia TeluguNews

లండన్ : ఫేస్‌బుక్.. ప్రపంచంలో ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏజ్‌తో సంబంధం లేకుండా వాడుతున్న సోషల్ యాప్. వందల కోట్ల మంది యూజర్లున్న ఫేస్‌బుక్‌ మరో 50 ఏళ్లలో ఆత్మలకు అడ్డాగా మారనుందట. యాప్‌లో లైవ్ ఫ్రొఫైల్స్ కన్నా డెడ్ యూజర్ల ప్రొఫైల్స్ పెరగనున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

<strong>ఏటా 7లక్షల మందిని చంపేస్తున్నారు..! ఉగ్రవాదులు కాదు? మరెవరు?</strong>ఏటా 7లక్షల మందిని చంపేస్తున్నారు..! ఉగ్రవాదులు కాదు? మరెవరు?

 వర్చువల్ స్మశానంలా ఫేస్‌బుక్

వర్చువల్ స్మశానంలా ఫేస్‌బుక్

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా అయిన ఫేస్‌బుక్ వందల కోట్లలో యాజర్లు కలిగి ఉన్నారు. వారిలో చాలా మంది వయోభారం, ఇతరత్రా కారణాల వల్ల మరో 50 ఏళ్లలో చనిపోనున్నారు. అలా మృతి చెందిన వారి ఖాతాలు డిలీట్ చేయకపోవడం వల్ల ఫేస్‌బుక్ డెడ్ ప్రొఫైల్స్ ఎక్కువవుతాయన్నది ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు మాట. ఈ లెక్కన చూస్తే 2070 నాటికి ఫేస్‌బుక్ వర్చువల్ స్మశానంలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2070 నాటికి పెరగనున్న డెడ్ యూజర్స్

2070 నాటికి పెరగనున్న డెడ్ యూజర్స్

2018లో ఫేస్‌బుక్ యూజర్ల ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే శతాబ్దం చివరి నాటికి దక్షిణాసియాలో 44శాతం మంది యూజర్లు మృతి చెందనున్నారు. అంటే 2100 నాటికి 140కోట్ల మంది యూజర్ల ప్రొఫైళ్లు డెడ్ కానున్నాయి. ఈ లెక్కన చూస్తే 2070 నాటికి ఫేస్‌బుక్‌లో లైవ్ ప్రొఫైల్స్ కన్నా డెడ్ యూజర్ల ప్రొఫైళ్లు పెరగనున్నాయి. ఫేస్‌బుక్ ప్రస్తుతం విస్తరిస్తున్న రేటు ఇలాగే కొనసాగితే శతాబ్దం చివరి నాటికి ఫేస్‌బుక్ యూజర్లు 490కోట్లకు చేరనున్నారు.

హిస్టరీ రీసెర్చ్‌కు బేస్

హిస్టరీ రీసెర్చ్‌కు బేస్

ఫేస్‌బుక్ యూజర్లు మరణిస్తే వారి డేటాపై ఎవరికి హక్కు ఉంటుందన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. నిజానికి చనిపోయిన వారి ప్రొఫైళ్లను ఫేస్‌బుక్ డిలీట్ చేయదు. ఆ అకౌంట్లను స్మారక పేజీలుగా మార్చవచ్చు. లేదా మృతుల కుటుంబసభ్యులు, స్నేహితులు వాటిని కొనసాగించవచ్చు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ పోస్టులను బట్టి చరిత్రకారులు భవిష్యత్తులో ప్రస్తుత పరిస్థితులు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు.

English summary
New analysis by academics from the Oxford Internet Institute, part of the University of Oxford, predicts the dead may outnumber the living on Facebook within fifty years, a trend that will have grave implications for how we treat our digital heritage in the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X