వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ అరేబియాలో 47 మందిని ఉరి తీశారు

|
Google Oneindia TeluguNews

రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ తో సహా 47 మందికి శనివారం ఉరి శిక్ష అమలు చేశామని సౌదీ అరేబియా హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే 47 మందికి ఉరి శిక్ష అమలు చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారికి కచ్చితంగా ఉరి శిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. 2003-2006 మధ్య కాలంలో ఆల్ ఖైదాతో సంబంధాలు కొనసాగిస్తూ ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది.

 The death sentence of Nimar al Nimar in Saudi Arabia

2015వ సంవత్సరంలో 158 మందికి పైగా మరణ శిక్ష అమలుచేశామని సౌదీ ప్రభుత్వ అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. కేవలం నవంబర్ నెలలో 45 మంది విదేశీయులతో సహ 63 మందికి ఉరి శిక్ష అమలు చేశారు.

మాదకద్రవ్యాల రవాణా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేశామని, నేరం చేశారని రుజువు కావడంతో మరణ శిక్ష పడిందని అన్నారు. 1995లో సౌదీ అరేబియాలో అత్యధికంగా 192 మందికి ఉరి శిక్ష అమలు చేశారు.

English summary
The deaths come amid a growing war of words between Saudi Arabia and the militant group Islamic State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X