పారీస్లో మరోసారీ టెన్షన్.. గుర్తు తెలియని వ్యక్తి ఈఫిల్ టవర్ ఎక్కేందుకు యత్నం ..!
సోమవారం గుర్తు తెలియని వ్యక్తి పారీస్లోని ఈఫిల్ టవర్ ఎక్కే ప్రయత్నం చేయడంతో మరోసారి పారీస్లో ఉద్రిక్తత వాతవరణం నెలకోంది. దీంతో పారీస్ అధికారులు ఈఫీల్ టవర్ ప్రాంతం సందర్శనను నిషేధించారు. కాగా తదుపరి నోటీసులు ఇచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.ఈనేపథ్యంలోనే ఈఫిల్ టవర్ సందర్శకులను ముందుస్తు జాగ్రత్త చర్యగా నిషేధించినట్టు తెలిపారు.కాగ టవర్ ప్రాంతానికి అగ్నిమాపక వాహానాలతోపాటు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

కాగా ఈఫిల్ టవర్ నిర్మించి 130 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈఫిల్ టవర్ ప్రాంతాన్ని లేజర్ షో తోపాటు ఇతర లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈఫిల్ టవర్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున విజిటర్ చేరుకున్నారు. కాగా ఈఫిల్ టవర్ను ప్రతి సంవత్సరం 60 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు.
కాగా పారీస్లో కోద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే..ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలోనే అక్కడ కట్టుదిట్టమైన
ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాంటీ చిన్న సంఘటన జరగకుండా ఐసీస్ దాడుల తర్వాత అప్రమత్తమైంది పారీస్.