వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లికి 26ఏళ్లు-ఆమె కూతురుకు 25ఏళ్లు!: ఇలా సాధ్యం చేశారు!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బిడ్డకు 25ఏళ్లు, తల్లికి 26 ఏళ్లు.. అని చదవగానే.. ఎవరికైనా ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వెంటనే వచ్చేస్తుంది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

1992 అక్టోబరు 14 నుంచి ఓ దాత నుంచి సేకరించిన ఒక పిండాన్ని శీతలీకరించి భద్రపరిచారు వైద్యులు. పాతికేళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న ఆ పిండం పసిపాపగా ప్రాణం పోసుకునేలా చేశారు.

 26ఏళ్ల నాటి పిండం

26ఏళ్ల నాటి పిండం

ఆ వివరాల్లోకి వెళితే.... ఈ సంవత్సరం మార్చిలో టీనా అనే 26ఏళ్ల అమెరికన్ మహిళ గర్భంలోకి ఆ పిండాన్ని ప్రవేశపెట్టడంతో.. ఆమె గర్భం దాల్చింది. నవంబర్ 25న పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది.

 టీనా భర్తకు జన్యుపరమైన సమస్య

టీనా భర్తకు జన్యుపరమైన సమస్య

పాపకు జన్మనిచ్చిన టీనా భర్త బెంజమిన్ గిబ్సన్‌కు జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో టీనా-బెంజిమన్ జంట దాత నుంచి సేకరించిన పిండం ద్వారా బిడ్డను కనాలని అనుకున్నారు.

 పండంటి పాప..

పండంటి పాప..

‘అమెరికా నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్' మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెఫెరే కీనన్ ఆధ్వర్యంలో పాతికేళ్ల నాటి పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. 9నెలల తర్వాత టీనా.. పండంటి పాప(ఎమ్మా వ్రెన్ గిబ్సన్)కు జన్మనిచ్చింది.

 మాకూ తెలియదు..క్రిస్మస్ కానుక

మాకూ తెలియదు..క్రిస్మస్ కానుక

కాగా, పిండం పాతికేళ్ల క్రితం నాటిదని తమకు తెలియదని టీనా దంపతులు తెలిపారు. ఆ లెక్కన చూస్తే వయసురీత్యా తన కూతురు, తాను మంచి స్నేహితులమేనని టీనా చెప్పారు. అంతేగాక, తన కుమార్తె దేవుడిచ్చిన క్రిస్మస్ కానుక అని టీనా తెలిపారు. ఆ పాపకు ఎమ్మా వ్రెన్ గిబ్సన్ అనే పేరు పెట్టారు.

English summary
Emma Wren Gibson, delivered November 25 by Dr. Jeffrey Keenan, medical director of the National Embryo Donation Center, is the result of an embryo originally frozen on October 14, 1992.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X