వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో పిల్లచేష్టలు: అత్యవసర ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెల్స్: చిన్న వివాదం పెద్దది కావడంతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటన లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగింది. సుమారు ఐదు గంటల పాటు ప్రయాణికులు ఎయిర్ పోర్టులో వేచి ఉండి తరువాత తమ గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లారు.

సౌత్ వెస్ట్ ఎయిర్ వేస్ విమానం లాస్ ఏంజెల్స్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ మహిళా ప్రయాణికురాలు తన సీటును కొద్దిగా వెనక్కు నెట్టారు.

ఆ సందర్బంలో వెనుక కూర్చుని ఉన్న ఓ వ్యక్తి తనకు సీటు తగిలిందని రెచ్చిపోయాడు. ఆ ప్రయాణికుడు నానా హంగామా చేశాడు. అసహనానికి గురై ఆమె పీకపట్టుకుని నులిమేశాడు. తరువాత ఆమె జుట్టు పట్టుకుని తల మీద తీవ్రంగా దాడి చేశాడు. ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యి కిందపడిపోయింది.

The FBI took over after the flight was recalled

విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు అతనిని వారించి విమాన సిబ్బందికి విషయం చెప్పారు. అంతటితో అతడు వదిలి పెట్టలేదు. మహిళా ప్రయాణికురాలితో సహ సిబ్బందితో వాగ్వివాదానికి దిగడంతో నానా రభస అయ్యింది.

విషయం తెలుసుకున్న పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నానని అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎఫ్ బీఐ అధికారులు గొడవ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విమానం టేకాఫ్ తీసుకున్న తరువాత మహిళా ప్రయాణికురాలు రిలాక్స్ కోసం సీటు వెనక్కి జరిపిందని, వెనుక సీటులో కుర్చున్న వ్యక్తి సహనం కొల్పోయి నానా హంగామా చేశాడని సాటి ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.

సుమారు ఐదు గంటల పాటు విమానం ఆలస్యం అయ్యింది. తరువాత ప్రయాణికులను శాన్ ఫ్రాన్సిస్కో కు తరలించారు. విమానం ఆలస్యం కావడంతో సుమారు రెండు లక్షల డాలర్లు నష్టపోయామని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసొసియేన్ తెలిపింది.

English summary
The plane was ordered to return to the gate. The aircraft, a Boeing 737-300, was carrying 137 passengers on board at the time of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X