వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆర్థిక సాయంతో పాకిస్తాన్‌లో పట్టాలెక్కిన తొలి మెట్రో రైలు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్ మెట్రో రైలు

పాకిస్తాన్‌లో తొలి మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చింది.

పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో దేశంలో తొలి మెట్రో లైన్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి.

27 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో ఆరంజ్ లైన్‌లో దాదాపు 25 స్టేషన్లు ఉన్నాయి.

జనాభా ఎక్కువగా ఉండే లాహోర్ నగరంలో దీనివల్ల ఎక్కడికి వెళ్లాలన్నా రాకపోకలు సులభం కానున్నాయి.

పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించిన ఈ మెట్రో పూర్తిగా అందుబాటులోకి వస్తే రోజూ దాదాపు 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా.

పాకిస్తాన్ మెట్రో రైలు

ఈ ప్రాజెక్టును 300 బిలియన్ల రూపాయలతో నిర్మించారు. దీన్ని పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పట్టింది.

చైనా తన వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ప్రాజెక్ట్ కింద పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వాటితోనే ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించారు.

ఈ మెట్రో లైన్ నిర్మాణంపై వ్యతిరేకత కూడా వచ్చింది. దీని కోసం 600కు పైగా చెట్లను కొట్టేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
First Metro train launched in Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X