• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బంగ్లాదేశ్ న్యూస్ చానల్‌లో తొలిసారిగా వార్తలు చదివిన ట్రాన్స్‌జెండర్ - Newsreel

By BBC News తెలుగు
|
తశ్‌నువా

బంగ్లాదేశ్‌లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ టీవీలో వార్తలు చదివారు. 29 ఏళ్ల తశ్‌నువా అనాన్ శిశిర్ సోమవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో మూడు నిమిషాల వార్తను చదివారు.

"నేను నా చదువును నమ్ముకున్నాను. కెరీర్ మీద దృష్టి పెట్టాను. ఇవాళ నాకు ఒక అవకాశం లభించింది" అని తశ్‌నువా బీబీసీతో అన్నారు.

బంగ్లాదేశ్‌లో సుమారు 15 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారు ఎక్కువగా వివక్షకు హింసకు గురవుతున్నారు. మనుగడ కోసం, వారిలో చాలామంది సెక్స్ వర్కర్లు మారడమో అడుక్కోవడమో చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడుతుంటారు. తాను కూడా మానసిక వేధింపులకు, లైంగిక హింసకు గురయ్యానని శిశిర్ అన్నారు. 'నా తండ్రి కూడా నాతో మాట్లాడటం మానేశార'ని చెప్పారు.

ఇంటి నుంచి పారిపోయి రాజధాని ఢాకాలో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. కానీ, చదువు ఆపలేదు. పబ్లిక్ హెల్త్‌లో ఎంఏ పూర్తి చేశాక టీవీ ఛానెళ్లలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. బైశాఖి అనే ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ మాత్రమే శిశిర్‌కు న్యూస్ యాంకర్‌ ఉద్యోగం ఇచ్చింది.

ఆ చానల్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, 'ఇది చరిత్రాత్మక సందర్భం. ఇది కొంతమంది ప్రేక్షకులకు ఆగ్రహం కలిగించవచ్చు. కానీ, మా చానల్ మాత్రం ఆ ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం ఇవ్వడానికి కట్టుబడి ఉంది' అని అన్నారు.

తశ్‌నువా అనాన్ శిశిర్

వార్త చదివిన తరువాత తశ్‌నువా శిశిర్ భావోద్వేగానికి గురయ్యారు. గట్టిగా ఏడ్చారు.

చిన్నప్పుడు తాను ఇలా ఎందుకున్నానని బాగా కోపం వచ్చేదని, ఇప్పుడు ఎల్జీబీటీల్లో వార్తలు చదివిన మొదటి వ్యక్తిని కావడం గర్వంగా ఉందని శిశిర్ న్నారు. శిశిర్ ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం 2013లో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక జెండర్‌గా గుర్తించింది. అయిదేళ్ల తరువాత వారికి ఓటు హక్కు కూడా కల్పించింది.

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు.

మంగళవారం రాజ్‌భవన్ వెళ్లిన ఆయన గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు తన రాజీనామాను అందించారు.

రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన "ఈ నిర్ణయం పార్టీ సామూహికంగా తీసుకుందని" చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యేలందరూ బుధవారం సమావేశం అవుతారని కూడా త్రివేంద్ర సింగ్ చెప్పారు.

రాజీనామాకు కారణం అడిగినప్పుడు "దానికి దిల్లీ నుంచి సమాధానం లభిస్తుంది" అన్నారు.

రాజీనామాపై ఊహాగానాలు

గత కొన్ని రోజుల నుంచీ ఆయన పదవి వీడుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.

"ముఖ్యమంత్రి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదిస్తున్నారని, పార్టీ అధ్యక్షుడితో కూడా చర్చించారని బీజేపీ ఎమ్మెల్యే మున్నా సింగ్ చౌహాన్ అంతకు ముందు ఏఎన్ఐతో అన్నారు..

2000 సంవత్సరం తర్వాత నుంచి ఉత్తరాఖండ్ 8 మంది ముఖ్యమంత్రులను చూసింది.

70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అసెంబ్లీలో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The first transgender person to read the news on the Bangladesh News Channel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X