వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వండర్: 223 అడుగుల ఎత్తులో ఫుట్ పాత్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా సివిల్ ఇంజనీర్లు ప్రయోగాలు చెయ్యడంలో ముందు వరుసలో ఉంటారు. ప్రపంచంలోనే ఎత్తైన ఫుట్ పాత్ నిర్మించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. భూమికి 223 అడుగుల ఎత్తులో ఫుట్ పాత్ నిర్మించారు.

రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్ నుంచి ఓ షాపింగ్ మాల్ లోకి నేరుగా ఈ ఫుట్ పాత్ నిర్మించారు. నైరుతీ చైనాలోని
చోంగ్ పింగ్ నగరంలో బహుళ అంతస్తుల రెసిడెన్సిల్ అపార్ట్ మెంట్ ఉంది. కొన్ని వేల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు.

వీరు షాపింగ్ కు వెళ్లాలంటే రోడ్లు చుట్టు వేసుకుని ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోని వెళ్లాల్సి ఉంది. అయితే విషయం తెలుసుకున్న సివిల్ ఇంజనీర్లు అపార్ట్ మెంట్ 22వ అంతస్తు నుంచి షాపింగ్ మాల్ లోకి ఫుట్ పాత్ నిర్మించాలని నిర్ణయించారు.

The footpaths are suspended 216 feet and 223 feet above the ground

75 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో ఫుట్ పాత్ నిర్మించారు. ఫుట్ పాత్ నిలవడానికి 8 ఉక్కు కేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ మీద నుంచి కిందకు చూడటానికి విండోస్ వంటి కంతలు ఏర్పాటు చేశారు.

ఇక్కడి నుంచి కిందకు చూస్తే కళ్లు తిరిగిపోతాయని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు అంటున్నారు. అయితే రానురాను అలవాటైపోతుందని అంటున్నారు. మొత్తం మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ పాత్ నిర్మించి చైనా రికార్డు సృష్టించింది.

English summary
Two impressive bridges have been built between the 22nd floor of a residential building and a shopping mall in the city of Chongqing, southwest China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X