వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ యువతి కళ్లల్లోంచి రక్తం ధారగా కారుతోంది(వీడియో)

|
Google Oneindia TeluguNews

లండన్: కంటి నుంచి తరచూ నీరు కారితేనే మనం ఎంతో ఆందోళనకు గురవుతాం. కానీ, ఈ యువతి కళ్లల్లోంచి ఏకంగా రక్తమే ధారగా వస్తోంది. రోజులో సుమారు ఐదుసార్లు ఆమె కళ్లల్లోంచి రక్తం కారడమే గాక, ఆమె ముక్కు, చెవుల నుంచి, నాలుక నుంచి, తల పైభాగం నుంచి చేతి వేళ్ల కొనల గోళ్ల నుంచి కూడా ఇప్పుడు నిత్యం చిక్కనైన రక్తం కారుతూనే ఉంది.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, ఎన్నో వైద్య పరీక్షలు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బాధితురాలి శరీరంలో ఎలాంటి సమస్యా లేదని చెబుతున్న వైద్యులు.. ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోతున్నారు. వైద్య విజ్ఞానికి అందని సమస్య కావడంతో ఆమెను 'మిస్టీరియన్ గర్ల్' అని పిలుస్తున్నారు.

The girl who bleeds from her EYES and EARS

ఈ మిస్టీరియన్ గర్ల్ పేరు మార్నీ హార్వే(17). చిన్న వయస్సులోనే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న ఆమె తన ఆవేదను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. 2013 నుంచి తనకు ఈ సమస్య ప్రారంభమైనట్లు తెలిపింది. ఓ రోజు నిద్రలేవగానే కళ్లు మసగ్గా ఉండటంతో ఆందోళన చెందిన తాను అద్దంలో చూసుకున్నానని, కళ్లల్లోంచి రక్తం రావడం గమనించి భయపడిపోయానని తెలిపింది.

కళ్లల్లోంచి రక్తం కారుతున్న తనను చూసి తన తల్లి కేథరినా(43), సోదరుడు భయంతో కేకలు వేశారని చెప్పింది. వెంటనే తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని, వైద్యులు మాత్రం అన్ని పరీక్షలు నిర్వహించి ఏ సమస్యా లేదని చెప్పారని తెలిపింది. కళ్ల నుంచి మొదలైన ఈ సమస్య 2015 నుంచి ముక్కు, నోరు, చెవి, తల భాగాలకు చేరుకుందని, ఆ భాగాల నుంచి కూడా రక్తం కారడం మొదలైందని వాపోయింది. ఎన్ని సార్లు ఎన్ని ఆస్పత్రులకు తిరిగిన తన సమస్యకు పరిష్కారం దొరకలేదని తెలిపింది.

ఈ సమస్య కారణంగా తన విద్యను కూడా కొనసాగించలేకపోయానని వాపోయింది. అంతేగాక, కొందరు వైద్యులు తనన ప్రయోగశాలగా భావించి నూతన వైద్యులకు తనను చూపించి కేస్ స్టడీ చేస్తున్నారని తెలిపింది. తనకు ఏవేవో వ్యాధులున్నాయని పలువురు అంటున్నారని చెప్పింది. ఇప్పటికైనా తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది.

English summary
17-year-old suffers from mystery condition which causes blood to seep from her orifices five times a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X