వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron virus:ఒమ్రికాన్ వైరస్ పుట్టుక ఎలా..? వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటీ..?

|
Google Oneindia TeluguNews

యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ పట్టుకుంది. సౌతాఫ్రికాలో కేసులు వెలుగుచూడటంతో అన్నీ దేశాలు అలర్ట్ అయ్యాయి. దీంతో ఆ వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది. ఎన్ని మ్యూటెంట్లుగా పరివర్తనం చెందనుంది. చికిత్స/ వ్యాక్సిన్‌ కంట్రోల్ చేస్తోందా అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర అంశాలను తెలియజేశారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

పరిశోధన

పరిశోధన

గతేడాది ఏప్రిల్‌లో సార్స్ కొవిడ్-2 వేరియంట్‌ను సౌతాఫ్రికా, బ్రిటన్ గుర్తించి.. తగిన చర్యలను సిఫారసు చేశాయి. దక్షిణాఫ్రికా నేషనల్ హెల్త్ ల్యాబొరేటరీ సర్వీస్, ప్రైవేట్ ల్యాబ్‌లలో చేసిన పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మిగతా ల్యాబ్‌లలో కూడా వైరస్ గురించి పరిశోధన చేశారు. యాంటి బాడీల ఉత్పత్తిని పరిశీలించారు. కొత్త వైరస్‌ను జయించేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలా..? ఇన్ ఫెక్షన్ సొకకన్నా ముందే చర్యలు తీసుకోవాలనే అంశంపై శోధించారు. అయితే బీటా వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందిందనే విషయాన్ని వివరించారు. ఆ తర్వాత డెల్టా భయాందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికాలో మూడో వేవ్ భయపెట్టింది. తర్వాత దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. 77 శాంపిల్స్ పరీక్షించగా.. ఒమిక్రాన్ అని తెలిసింది. తర్వాత బొట్వ్సానా, హంకాంగ్‌లో కూడా కేసులు వెలుగుచూశాయి.

 రోగ నిరోధక శక్తి తక్కువ

రోగ నిరోధక శక్తి తక్కువ

వైరస్ వేరియంట్ సౌతాఫ్రికాలోనే ఎందుకు వస్తున్నాయనే అనుమానం కలుగక మానదు.. అయితే దీనికి సైంటిస్టులు ఈ విధంగా చెబుతున్నారు. ఇక్కడ జనానికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో వైరస్ పూర్తిగా నిర్మూలన జరగలేదని.. అందుకే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని వివరించారు. బలహీన వ్యక్తుల వల్ల ఇలా జరగుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఇక్కడ హెచ్ఐవీ సోకిన వారు చాలా మంది ఉన్నారు. సో వారికి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వారు తగిన చికిత్స కూడా తీసుకోవడం లేదు. దీంతో వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

కాంబినేషన్ చూడలే

కాంబినేషన్ చూడలే

ఒమిక్రాన్ వేరియంట్ వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదివరకు ఇలాంటి కాంబినేషన్ చూడలేమని వారు వివరించారు. ప్రొటీన్‌కు సంబంధించి 30 మ్యూటెషన్స్ ఉన్నాయి. కొత్త వేరియంట్‌ను బీటాతో పోల్చలేమని వివరించారు. ఇమ్యూనిటీ ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. దీనికి సంబంధించి రెండు విధాలుగా స్టడీ చేశామన్నారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొగలవా అని ప్రశ్నిస్తే.. కచ్చితంగా తెలియదు అని సైంటిస్ట్ తెలిపారు. కానీ పౌష్టికాహారం తీసుకొని.. జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు.

50 ఉత్పరివర్తనాలు

50 ఉత్పరివర్తనాలు

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించాల్సి ఉంటుంది.

English summary
South Africa and the UK were the first big countries to implement nationwide genomic surveillanceefforts for SARS-CoV-2 as early as April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X