వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఆలోచనకే కడుపులో డోకు -మళ్లీ గెలిస్తే అమెరికా గతి అంతే: హిల్లరీ క్లింటన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

''అమెరికా దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించుకున్న ప్రజాస్వామిక వ్యవస్థల్ని కేవలం నాలుగేళ్లలోనే డొనాల్డ్ ట్రంప్ ధ్వంసం చేసిన తీరును మనమంతా చూశాం. తన పంతం కోసం, ఎన్నికల్లో గెలుపుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు. అయితే, ఈ నాలుగేళ్ల అనుభవం దృష్ట్యా.. అతను మామూలు మనిషి కాదని, తనలో ఏ కోశానా నిజాయితీ లేదని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. పొరపాటున ట్రంప్ మళ్లీ గెలుస్తాడన్న ఆలోచనకే నాకు కడుపులో తిప్పినట్లవుతుంది..'' అని హిల్లరీ క్లింటన్ చెప్పారు.

అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్‌లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్‌లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే ఎక్కువ పాపులర్ ఓట్లు సాధించినా, ఎలెక్టోరల్ ఓట్లు మాత్రం ట్రంప్ కు అనుకూలంగా రావడంతో అమెరికా చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాన్ని హిల్లరీ క్లింటన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 2020 ఎన్నికల్లో తమ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్య అభ్యర్థులు జోబైడెన్, కమలా హ్యారిస్ గెలుపుపై హిల్లరీ ధీమా వ్యక్తం చేశారు.

the Idea of Trump Winning, Makes Me Sick to My Stomach: Hillary Clinton

ట్రంప్ గనుక మళ్లీ గెలిస్తే అమెరికా పని అయిపోయినట్లేనని, నాలుగేళ్లలో దేశాన్ని ఎంతో దిగజార్చిన ట్రంప్ కు మరో నాలుగేళ్లు అధికారాన్ని అప్పగిస్తే దేశం మరింత దిగజారడం ఖాయమని హిల్లరీ అన్నారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్లు చేశారు. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, ఇప్పటికే 40 శాతం మంది ఓటర్లు ముందస్తుగానే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక..

అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామఅడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ

2020 అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలిస్తే.. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలిగా ఫెడరల్ ప్రభుత్వంలో ఏదైనా పదవి చేపడతారా? అన్న ప్రశ్నకు హిల్లరీ క్లింటన్ నో అని సమాధానమిచ్చారు. అవసరమైతే బయటి నుంచి సలహాలు ఇస్తానేగానీ, పదవిని చేపట్టబోనని ఆమె స్పష్టం చేశారు. అయినా, బైడెన్ కు డిప్యూటీగా ఉండబోయే కమలా హ్యారిస్ చాలా సమర్థవంతమైన నాయకురాలని, ఆమె అద్భుతాలు చేయబోవడం మనమంతా చూస్తామని హిల్లరీ పేర్కొన్నారు.

English summary
US' former Secretary of State Hillary Clinton says she cannot "entertain" the idea of President Donald Trump winning the 2020 election and it makes her "sick to my stomach" to think there could be four more years of abuse and destruction of Americans institutions and lessening of US leadership if Trump is re-elected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X