• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జకీర్ ‌నాయక్ బహిరంగ ప్రచారాలపై నిషేధం...

|

ఇస్లాం మతభోదకుడు జకీర్‌ నాయక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మలేషియా ప్రభుత్వం ఆయన పబ్లిక్ ప్రసంగాలను దేశవ్యాప్తంగా నిషేధించింది. ఇటివల ఆయన మలేషియాలో ఉన్న ఇండియన్స్‌తో పాటు చైనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మలేషియా ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను సిరియస్‌గా తీసుకుంది. కాగా ఇప్పటికే జకీర్ నాయక్ ప్రసంగాలపై దేశంలోని పలు రాష్ట్రాలు నిషేధించాయి. మరోవైపు ఆయన పర్మినెంట్ రెసిడెన్స్ సర్టిఫెకెట్‌ను రద్దు చేసే అవకాశాలున్నట్టు సమాచారం.

మలేషియా హిందువులు, చైనీయులపై అనుచిత వ్యాఖ్యలు

మలేషియా హిందువులు, చైనీయులపై అనుచిత వ్యాఖ్యలు

ఈ నెల 8న మలేసియాలోని హిందువులు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎక్కువ విధేయంగా ఉంటారని జకీర్ నాయక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు భారతదేశంలో ముస్లింల కంటే మలేషియా ముస్లింలే వంద శాతం ఎక్కువ ఎంజాయ్ చేస్తారని అన్నారు. మరోవైపు మలేషియాలో ఉన్న భారతీయులతో పాటు చైనీయులను వలసవాదులుగా చీత్రీకరించాడు. దీంతో ఆయన వ్యాఖ్యలను మలేషియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జకీర్ నాయక్ వ్యాఖ్యలపై అక్కడి పోలీసులు సుమారు పది గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలను నిషేధించామని తెలిపింది. మరోవైపు జకీర్ నాయక్‌ ప్రసంగాలపై 150పైగా కేసులు నమోదయ్యాయని, ఇందులో భాగంగానే మలేషియాలోని పలు రాష్ట్రాలు జకీర్ నాయక్ ప్రసంగాలను ఇప్పటికే రద్దు చేశాయి

ప్రపంచమంతా శాంతిని పంచడమే తన లక్ష్యం

ప్రపంచమంతా శాంతిని పంచడమే తన లక్ష్యం

ఇక జకీర్ నాయక్ ప్రసంగాల ద్వార ప్రభావితులైన చాలమంది ఉగ్రవాదం బాట పట్టామని పులువురు ఉగ్రవాదులు తెలిపిన విషయం తెలిసిందే..ముఖ్యంగా ముంబాయి బాంబు పేలుళ్లతో పాటు, ఇటివల జరిగిన శ్రీలంక బాంబు పెలుళ్లలలో పాల్గోన్న వారితో పాటు, ట్రిపుల్ కేసును వాదించిన అడ్వకేట్స్‌పై దాడి చేసిన కేసులో పట్టుబడ్డ నిందితులు సైతం జకీర్ నాయక్ ప్రసంగాల ద్వార ప్రభావితులయ్యామని తెలిపారు. దీంతో ఆయన ప్రసంగాలపై చాల చర్చ జరుగుతోంది. కాని జకీర్ నాయక్ మాత్రం తన ప్రసంగాలు వినని వారే తనపై అభండాలు వేస్తున్నారని, తనపై అరోపణలు చేసే వారు ఒక్కసారి తన ప్రసంగాలు వినాలని ఆయన అన్నారు. దీంతో తన లక్ష్యం శాంతి అని, ఖురాన్ కూడ ఇదే చెబుతుందని అన్నారు ఈనేపథ్యంలోనే ప్రపంచమంతా శాంతిని వ్యాపింప చేయడమే తన లక్ష్యమని పేర్కోన్నారు.

జకీర్ నాయక్ ఆస్తులను ఈడీ అటాచ్

జకీర్ నాయక్ ఆస్తులను ఈడీ అటాచ్

భారత ప్రభుత్వం జకీర్ నాయక్ పాస్‌పోర్టును కూడ రద్దు చేయడంతో మలేషియాలో తలదాచుకునేందుకు 2016లోనే భారత్ విడిచి పారిపోయారు.. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఆయన పౌరసత్వం ఇచ్చింది. కాగా జకీర్ నాయక్‌ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఇటివలే ఆయన ఆస్తులు అటాచ్ చేస్తూ...కేసు నమోదు చేసింది. పీస్ టీవీ ద్వార ఉగ్రవాదుల కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు జకీర్ నాయక్ ఎదుర్కోంటున్నారు. ఇదివరకే జకిర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించాలని భారత దేశం మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు కూడ మలేషియా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after Zakir Naik was quizzed for over 10 hours by police for his remarks against Malaysian Hindus, the Islamic preacher has been banned from giving public speeches anywhere in Malaysia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more