వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకుల ఖరీదు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒకరు. ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అతని భార్యతో విభేదాలు వచ్చిన కారణంగా ఇద్దరూ వేరవ్వాలని భావిస్తున్నారు. అయితే జెఫ్ బెజోస్ భాగస్వామిగా ఉన్న మెకెన్జీకి ఎంత ఆస్తి వస్తుందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుత భార్యకు విడాకులు ఇవ్వగానే ఆమెకు ఎంత వాటా వస్తుంది...? ఆ ప్రభావం తన కంపెనీ అమెజాన్‌పై ఏమేరకు పడుతుంది...?

 1992లో తొలిసారిగా కలిసిన జెఫ్ బెజోస్-మెకెన్జీ

1992లో తొలిసారిగా కలిసిన జెఫ్ బెజోస్-మెకెన్జీ

అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ వైవాహిక జీవితం దారితప్పింది. ఇప్పటి వరకు జెఫ్ బెజోస్ అతని భార్య మెకెన్జీలు కలిసి బాగానే కాపురం చేశారు. సంసారాన్ని నడిపారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ వయస్సు 54 ఏళ్లు. ఇద్దరికి పెళ్లికి ముందే పరిచయం ఉంది. 1992లో తొలిసారిగా జెఫ్ మెకెన్జీలు కలిశారు. ఆ సమయంలో జెఫ్ వాల్‌స్ట్రీట్‌లో పనిచేసేవారు. 1992లో కలిసిన వీరు ఏడాది సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి భర్త వెంటే నిలిచింది. 1994లో అమెజాన్ కంపెనీ సియాటెల్‌లోని ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభమైంది. ఇక చిన్న గ్యారేజీలో ప్రారంభమైన సంస్థ ఖండాతరాలకు విస్తరించింది. వారికి నలుగురు పిల్లలు. అందులో ముగ్గురు మగపిల్లలు అయితే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

వివాహానికి ముందు లేని ఆస్తి పంపకాల ఒప్పందం

వివాహానికి ముందు లేని ఆస్తి పంపకాల ఒప్పందం

ఇక జెఫ్ బెజోస్, మెకెన్జీలు విడాకులు తీసుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. ఒకవేళ విడాకులు తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మహిళల జాబితాలో తొలిస్థానంలో మెకన్జీ నిలుస్తారు. . ఇక ఏ కారణం చేతైనా దంపతులు విడిపోవాలని భావిస్తే ఆస్తుల పంపకాల గురించి వివాహానికి ముందు ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు. 1993లో ఇద్దరు ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకుల సమయంలో చివరిగా ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్నే విడాకుల డాక్యుమెంట్లలో ప్రస్తావించడం జరుగుతుంది. వీరికి పలు ప్రాంతాల్లో నివాసాలు ఉన్నాయి. ఇందులో సియాటెల్, వాషింగ్‌టన్ డీసీ, టెక్సాస్, బెవెర్లీ హిల్స్, కాలిఫోర్నియాలున్నాయి.

 విడాకులు ఖరీదు నాలుగున్నర్ర లక్షల కోట్లు రూపాయలు

విడాకులు ఖరీదు నాలుగున్నర్ర లక్షల కోట్లు రూపాయలు

జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థలో ప్రాథమిక వాటాదారుడిగా 16శాతం వాటాను కలిగిఉన్నారు. అంటే 130 బిలియన్ డాలర్లు. ఒకవేళ విడాకులు తీసుకుంటే అందులో సగం మెకెన్జీకి వెళుతుంది. దీంతో ఆయన వాటా 8శాతానికి తగ్గుతుంది. అంటే మెకన్జీకి భరణం కింద వచ్చేది 65 బిలియన్ డాలర్లు.. మన భారత కరెన్సీలో అది నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు.అయితే ఇప్పటి వరకు ఈ అంశం ఇంకా షేర్ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. ఒకవేళ మెకెన్జీకి 8శాతం వాటా అమెజాన్‌లో వస్తే అమెజాన్‌లో తన ఓటును మరొకరికి బదిలీ చేసుకునే వీలుంది. ఇద్దరూ విడాకుల తర్వాత మంచి సంబంధాలే కొనసాగిస్తే వారి షేర్లను ఒక ట్రస్టులో కానీ ఇతర న్యాయపరమైన సంస్థల్లో కానీ ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది.

 ఓ మాజీ న్యూస్ యాంకర్‌తో సంబంధం నెరుపుతున్న జెఫ్ బెజోస్

ఓ మాజీ న్యూస్ యాంకర్‌తో సంబంధం నెరుపుతున్న జెఫ్ బెజోస్

ఇక విడాకులకు కారణం జెఫ్ బెజోస్ హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ ప్యాట్రిక్ వైట్ షెల్ భార్యతో సంబంధాలు నెరుపుతున్నట్లు సమాచారం. ఆమె మాజీ న్యూస్ యాంకర్‌గా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత ఎనిమిది నెలల నుంచి వ్యవహారం నడుస్తున్నట్లు ఓ పత్రిక వెల్లడించింది. ఇదే జెఫ్ దంపతుల కాపురంలో చిచ్చు పెట్టిందని కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే జెఫ్ బెజోస్ విడాకుల పై విలేకరులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అడుగగా.. జెఫ్‌కు తాను ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు తన జీవితం అత్యంత సుందరంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ కూడా ఇద్దరి భార్యలకు విడాకులు ఇవ్వడం జరిగింది.

English summary
The announcement by Amazon founder Jeff Bezos, the world’s wealthiest man, and his wife that they will divorce has captivated the imagination.How will they split his giant fortune, estimated at $136 billion?And what will happen to the Internet retail giant?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X