వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోన్ట్ మిస్ : గురువారం ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం..ఎన్నింటికంటే..?

|
Google Oneindia TeluguNews

గురువారం రాత్రి ఆకాశంలో ఓ అద్భుతాన్ని వీక్షించే అవకాశం దొరుకుతుంది. ఆకాశం ఎప్పుడూ లేనంతగా ఉల్కాపాతంతో నిండిపోతుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో దర్శనమివ్వబోతోంది. ఆ సుందరమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. డిసెంబర్ 13న ఈ ఉల్కాపాతం ప్రారంభమై డిసెంబర్ 14 తెల్లవారు జాము వరకు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు 120 నుంచి 160 ఉల్కలు ఆకాశంలో కనువిందు చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక జెమినిడ్ ఉల్కలు నిమిషానికి రెండు కనిపిస్తాయని అవి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జెమినిడ్ ఉల్లలు రాత్రి వేళల్లో ఏసమయంలో కనిపిస్తాయి..?

జెమినిడ్ ఉల్లలు రాత్రి వేళల్లో ఏసమయంలో కనిపిస్తాయి..?

సాధారణంగా రాత్రి 9 గంటల నుంచే ఉల్కలు ఆకాశంలో దర్శనిమిస్తాయి కానీ ఇందులో ఆకట్టుకునే జెమినిడ్ ఉల్కలు మాత్రం అక్కడక్కడా దర్శనమిస్తాయి. చంద్రుడు చాలా మటుకు ఉల్కలు కనపడకుండా భూమికి అడ్డుగా నిలుస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉల్కా పాతాన్ని చూడాలనుకునేవారికి తెల్లవారు జామున రెండు గంటలకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో చంద్రడు కూడా పావు వంతుకు తగ్గిపోతాడని దీంతో అడ్డుకూడా తొలిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో ఉల్కలు బాగా కనిపిస్తాయని వారు చెబుతున్నారు. ఆసమయంలో చంద్రకాంతి కూడా ఉండదు కాబట్టి జెమినిడ్ ఉల్కలను వీక్షించే అవకాశం దొరుకుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడు అడ్డులేకుంటే ఉల్కాపాతం ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పిన నాసా... నవంబర్‌ నెలలో చంద్రుడు అడ్డురావడంతో లియోనిడ్ ఉల్కాపాతంను వీక్షించే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.

జెమినిడ్ ఉల్కలు ఎక్కడి నుంచి కనిపిస్తాయి..?

జెమినిడ్ ఉల్కలు ఎక్కడి నుంచి కనిపిస్తాయి..?

ఆకాశంలో చిమ్మ చీకటిగా ఉండే ప్రాంతంలో జెమినిడ్ ఉల్కలు స్పష్టంగా కనిపిస్తాయి. నగరాల్లో ఆకాశం కాలుష్యమయమై ఉంటుంది కనుక అక్కడ స్పష్టంగా కనిపించే అవకాశం ఉండదు. నక్షత్రాల సమూహాన్ని స్పష్టంగా చూడలేకపోతే జెమినిడ్ ఉల్కాపాతాన్ని కూడా క్లియర్‌గా చూసే అవకాశం కోల్పోతారని నాసా చెబుతోంది. ఉల్కలను స్పష్టంగా చూడాలంటే కచ్చితంగా చీకటిగా ఉంటేనే బాగా కనిపిస్తాయి. ఉల్కలను ఆకాశంలో వీక్షించేందుకు గాను మీ కళ్లు అడ్జెస్ట్ కావడానికి కనీసం అరగంట సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఆకాశం కూడా చాలా స్పష్టంగా ఉండాలని ఒకవేళ మబ్బులు ఆకాశాన్ని కప్పివేస్తే ఇక అది దురదృష్టంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీరు భూమిపై ఉండే ప్రాంతం ఉత్తరార్ధగోళంలో ఉంటే మీకు ఆకాశంలో నైరుతీ ప్రాంతంలోని నక్షత్రాల సమూహం నుంచి జెమినిడ్ ఉల్కాపాతం దర్శనమిస్తుందని నాసా స్పష్టం చేసింది. ఎంత ఎక్కువగా ఆకాశం కనిపిస్తే అంత ఎక్కువ ఉల్కలను వీక్షించే అవకాశం ఉందని తెలిపారు. భూమిపై పడుకోని లేదా ఒక కుర్చీలో వెనక్కు ఆనుకొని ఆకాశం వైపు చూస్తే ఎక్కువ ఉల్కలు చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మళ్లీ ఉల్లాపాతం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది..?

మళ్లీ ఉల్లాపాతం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది..?

వాతావరణం అనుకూలించకపోయి జెమినిడ్ ఉల్కాపాతాన్ని వీక్షించే అవకాశం కోల్పోతే ఈ ఏడాది చివరిన మరో ఉల్కాపాతం ఆకాశంలో కనువిందు చేయనుంది. డిసెంబర్ 21 శుక్రవారం రాత్రి ఉర్సిద్ ఉల్కాపాతం కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 22 తెల్లవారు జాము వరకు ఇది ఆకాశంలో కనువిందు చేయనుంది. ఇది క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు కనువిందు చేయనుంది. అయితే ఈ ఉర్సిద్ ఉల్కాపాతాన్ని చూడాలంటే కూడా ఆకాశం చాలా క్లియర్‌గా ఉండాలి. దీంతో పోలిస్తే జెమినిడ్ ఉల్కాపాతమే ఆకాశంలో చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అసలే చలికాలం .... ఓ ఫ్లాస్క్‌లో కాఫీ పోసుకుని రాత్రంతా ఆకాశం వైపు చూస్తూ కాఫీని ఆస్వాదిస్తూ ఉల్కలను వీక్షించండి.

English summary
There is no meteor shower in 2018 that will light up the sky more brilliantly than December's Geminid meteor shower. Yes, there are showers that are arguably better because they have plenty of meteors and land in a warm month like the Perseids but there isn't a shower that can rival the number of meteors the Geminids will cast across the sky. For that reason, it's an absolute must-see for stargazers.The Geminids will peak the night of Thursday, December 13 through the morning of Friday, December 14 with between 120 and 160 meteors per hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X