వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గకూడదనే!: ఆంక్షల వెనుక కిమ్ వ్యూహమిదే, దెబ్బతీసేందుకు ట్రంప్ కొత్త ఎత్తుగడలు..

చైనాతో ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఉత్తరకొరియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఇప్పటికే పలు రకాల ఆంక్షలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న ఉత్తరకొరియా ప్రజలపై మరో పిడుగు పడింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న అక్కడి ప్రజలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Kim Jong un bans singing and Mothers Day celebrations

ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు చెడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తుండటంతో దాన్ని గాడిన పెట్టడానికే ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజల అభిరుచులపై ఆయన ఆంక్షలు విధించారు.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

వేటిపై నిషేధం:

వేటిపై నిషేధం:

ప్రజల ఒక దగ్గర సమూహంగా ఏర్పడటం.. బృందగానం చేయడం.. మద్యం సేవించడం.. ఇతరత్రా వినోదాలపై నిషేధం విధిస్తూ కిమ్ జాంగ్ తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు దేశ ప్రజలకు బయటి సమాచారం చేరకుండా ఉండటానికి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు. రాజధాని ప్యోంగ్‌యాంగ్ లో బీర్ ఫెస్టివల్ ను రద్దు చేసిన కొన్ని నెలలకే కిమ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!

చిక్కుల్లో ఉ.కొరియా:

చిక్కుల్లో ఉ.కొరియా:

అగ్ర రాజ్యమైన తమపై అణు ప్రయోగాలకు కాలు దువ్విన ఉత్తరకొరియా మెడలు వంచడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉత్తరకొరియా పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో సంయుక్త ప్రణాళికలు రచించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో పలుమార్లు దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలను కూడా ప్రదర్శించింది.

ఐరాసపై ఒత్తిడి తీసుకొచ్చి ఉత్తరకొరియాతో చైనా సంబంధాలను విచ్చిన్నం చేయించింది. తాజాగా ఉగ్రవాద దేశాల జాబితాలో ఉత్తరకొరియాను చేరుస్తూ మరో షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ఉత్తరకొరియాపై అణుదాడి చేసేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. ఉత్తరకొరియాను టెర్రరిస్ట్ దేశంగా ప్రచారం చేయడం ద్వారా తన పని సులువుగా పూర్తి చేయాలనుకుంటోంది.

సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో.. సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో..

పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్:

పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్:

ఉత్తరొకొరియాలో నిషేధాజ్ఞాలు జారీ చేయడానికి ఒక గంట ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. సిరియా అంతర్యుద్దం, ఉక్రెయిన్ శాంతిభద్రతల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ తో పుతిన్ భేటీ అయిన మరుసటి రోజే ట్రంప్ ఆయనకు ఫోన్ చేయడం గమనార్హం.

పుతిన్ తో సంభాషణలో భాగంగా ఉత్తరకొరియా గురించి కూడా ట్రంప్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఉ.కొరియాపై మరింత ఒత్తిడి పెంచి అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో ఆ దేశం వెనక్కి తగ్గేలా చేయాలనుకుంటున్నారు. దాదాపు గంట సమయం పాటు వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగినట్టు సమాచారం. ఈ సంభాషణను ఆయన 'గ్రేట్ కాల్'గా అభివర్ణించారు.

 మరో మూడు కంపెనీలపై ఆంక్షలు:

మరో మూడు కంపెనీలపై ఆంక్షలు:

ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసి సఫలమైన అమెరికా.. ఆ దేశాన్ని చావుదెబ్బ తీసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో ఉత్తరకొరియాతో సంబంధాలు కలిగి ఉన్న మరో మూడు చైనీస్ కంపెనీలపై ఆంక్షలు విధించింది.

ఇందులో షిప్పింగ్ మరియు ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి ఉత్తరకొరియాకు దాదాపు 650బిలియన్ డాలర్ల ఎగుమతులు, 100బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. తాజా ఆంక్షలతో అవన్ని నిలిచిపోనున్నాయి.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే:

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే:

చైనాతో ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఉత్తరకొరియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే కిమ్ జాంగ్ తాజా ఆంక్షలు అమలులోకి తెచ్చినట్టు సమాచారం. ప్రజల ఖర్చులను నియంత్రించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉంచడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. తద్వారా ఉత్తరకొరియా అణు ప్రయోగాలకు ఆటంకం కలగదనేది ఆయన వ్యూహంగా తెలుస్తోంది.

English summary
According to briefings given yesterday, South Korean lawmakers were told that the leader hopes the move will suppress the impact of economic sanctions in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X